విజయీ విశ్వ తిరంగా ప్యారా!
ABN , Publish Date - May 18 , 2025 | 12:58 AM
ప్రధాని మోదీ ఆపరేషన్ సిం దూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, మే 17( ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఆపరేషన్ సిం దూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపుతో శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం పుష్కరాల రేవు నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు భారీ తిరంగా ర్యాలీ సాగింది. ర్యాలీ పొడవునా భారత రక్షణ సాయుధ దళాలకు మద్దతుగా నినాదాలతో దద్దరిల్లింది. భారీ జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోరువానను సైతం ప్రజాప్రతినిధులు ,ప్రజలు లెక్కచేయకుండా తిరంగా ర్యాలీ చేశా రు.మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మనమందరం గౌరవంగా భావించే స్ర్తీల నుదుట సిందూరాన్ని ఉగ్రవాదులు చేరిపేస్తే.. ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారన్నారు. తీవ్రవాదులకు ఆపరేషన్ సిం దూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాని మోదీ, ఆయనకు సహకరించిన జవాన్లకు సెల్యూట్ అని చెప్పారు. రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకలకు గట్టి బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ భారత త్రివిధ దళాలకు తాము వెన్నంటే ఉంటామన్నారు.పెద్దఎత్తున నగర ప్రజలు, మాజీ సైనికులు,ఎన్‌సీసీ క్యాడెట్లు జాతీయ పతాకాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ,నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు,రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అఽధికారులు పాల్గొన్నారు.