Share News

అదిగో పులి!

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:13 AM

పులి భయ పెడుతోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.

అదిగో పులి!
పులి పాదముద్రలు

గోపాలపురం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పులి భయ పెడుతోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. భీమోలు గ్రామంలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో ఆది వారం రాజమహేంద్రవరం అటవీశాఖ రేంజ్‌ అధికారి ఎస్‌.దా వీదురాజు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. భీమోలు గ్రామ శివారులో ఉన్న సరిహద్దు పుంతపొలాల్లో పులి, రెండు పిల్లలు సంచరిస్తున్నాయని గ్రామస్థులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. అటవీశాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా కొన్నిపాద ముద్రలు గుర్తించినట్టు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు..పాదముద్రల ఆధారంగా పులి సంచ రిస్తున్న పరిసర పొలాల్లో ఆదివారం ఆరు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దీంతో పులి కదలికలను గుర్తించవచ్చ న్నారు. పొలాలకు వెళ్లే రైతులు,కూలీలు, పశువుల కాపర్లు, అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ముగ్గురు లేదా నలుగురు కలిసి వెళ్లాలన్నారు. అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ప్రయాణించవద్దన్నారు. రెండు మూడు రోజుల్లో పులికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రజలకు సమాచారం చేరవేశామన్నారు. పులి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌ ఉన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 01:13 AM