Share News

టిడ్కో డబ్బులిస్తారా!

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:17 AM

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టిడ్కో ఇళ్లు రద్దయిన వారి డబ్బులు రూ.10.20 కోట్ల మేర పేరుకుపోయాయి. ఆ రిఫండ్‌ డబ్బులు వస్తాయో రావో అన్నట్టుగా పరిస్థితి మారింది. నిధుల విడుదలకు ఆయా మునిసిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నం చేస్తున్నా అమరావతిలో టిడ్కో ఉన్న తాధికారులు మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు.

టిడ్కో డబ్బులిస్తారా!
టిడ్కో ఇళ్లు

  • వైసీపీలో టిడ్కో నిధులు మళ్లింపు

  • ఇళ్లు రద్దు చేసినా చెల్లింపుల్లేవ్‌

  • ఐదేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు

  • అయోమయంలో రూ.10.52 కోట్లు

  • ఎంపీ, ఎమ్మెల్యేలకు విన్నపాలు

  • అయినా ఫలించని వైనం

లక్ష కట్టండి.. సొంతింట్లో దిగండి.. ఇదీ గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా.. చాలా మంది పేదలు అప్పులు చేసి మరి రూ.లక్ష చొప్పున కట్టారు. అయితే 2019లో టీడీపీ ఓటమిపాలవడంతో టిడ్కో ఇళ్లు ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో పలువురికి ఇళ్లను రద్దు చేసేసింది. అయితే ముందు చెల్లించాల్సిన రూ.లక్ష మాత్రం ఏ ఒక్కరికీ చెల్లించలేదు. గత ఐదేళ్లుగా సొమ్ము వెనక్కు రాక ఈసురోమంటున్నారు. అప్పులు చేసి కట్టిన డబ్బులు ఇవ్వకుండా ఎన్నాళ్లు ఏడిపిస్తారం టూ కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో తమకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతు న్నాయని.. ప్రస్తుత ప్రభుత్వమైనా కరుణించాలంటూ గ్రీవెన్స్‌ సెల్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. అయినా డబ్బుల సంగతి తేలకపోవడంతో అయోమయంలో ఉన్నారు.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టిడ్కో ఇళ్లు రద్దయిన వారి డబ్బులు రూ.10.20 కోట్ల మేర పేరుకుపోయాయి. ఆ రిఫండ్‌ డబ్బులు వస్తాయో రావో అన్నట్టుగా పరిస్థితి మారింది. నిధుల విడుదలకు ఆయా మునిసిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నం చేస్తున్నా అమరావతిలో టిడ్కో ఉన్న తాధికారులు మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో రూ.6.53 కోట్లు, రామచంద్రపురం రూ.1.20 కోట్లు, పెద్దాపురం రూ.59.28 లక్షలు, మండపేట రూ.42 లక్షలు, కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటీల్లో 21 లక్షల చొప్పున రిఫండ్‌ డబ్బులు పేరుకుపోయాయి.

  • టీడీపీ ఇస్తే..వైసీపీ వచ్చి లాగేసుకుంది..

2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో నివసించే పేదల కోసం టిడ్కో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017-2019 మధ్య లబ్ధిదారులను ఎంపిక చేసింది. టిడ్కో ఇళ్ల కోసం ఆయా మునిసిపాలిటీలకు లబ్ధిదారుడి వాటాగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25వేల చొప్పున చెల్లించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లపై కత్తి కట్టింది. పేదలకు ఇవ్వకుండా నిలిపివేసింది. వేలాది మందికి మంజూరైన టిడ్కో ఇళ్లను రద్దు చేసేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు అంతకు ముందు వారు చెల్లించిన మొత్తాన్ని వెనక్కు ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులను అప్పటికే మునిసిపాలిటీల నుంచి టిడ్కోలో ప్రత్యేక ఖాతాకు మళ్లించేసి వాడేసుకుంది. దీంతో లబ్ధిదారులు ఎంత మొత్తు కున్నా వారి డబ్బులను వెనక్కివ్వలేదు. చివరకు ఇప్పటికి ఐదేళ్లవుతున్నా ఏ ఒక్కరికీ డబ్బులు రిఫండ్‌ రాక వారంతా లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10.20 కోట్ల వరకు ఈ సొమ్ములు పేరుకుపోయాయి.

  • ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలంటే..

కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో రూ.6.53 కోట్లు రిఫం డ్‌ డబ్బులు వెనక్కు రాక లబ్ధిదారులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. రూ.లక్ష చొప్పున 589 మందికి, రూ.25 వేల చొప్పున 150 మందికి, రూ.50 వేల చొప్పున 448 మందికి డబ్బులు రాలేదు. అప్పట్లో కార్పొరేషన్‌ పరిధిలో 2,056 టిడ్కో ఇళ్లు నిర్మించారు. సైట్‌-ఏలో 1,152 ఇళ్లు, సైట్‌-బీలో 904 ఇళ్లు నిర్మిం చారు. వీటికి సంబంధించి ఇళ్లు మంజూరై ఆనక రద్దయిన, రద్దు చేసుకున్న లబ్ధిదారులకు రూ.6.53 కోట్లు వెనక్కు రాలేదు. సామర్లకోట మునిసిపాలిటీ పరిధిలో 1,056 ఇళ్లు నిర్మించగా వీటిలో రద్దు చేసు కున్న వారికి రూ.25 లక్షలు వెనక్కు రావాల్సి ఉంది. ఇందులో రూ.లక్ష చొప్పున 33 మందికి రావాల్సి ఉంది. పెద్దాపురం మునిసిపాలిటీలో 3,312 ఇళ్లు నిర్మించగా రద్దు చేసుకున్న వారికి రూ.59.28 లక్షలు ఐదేళ్ల నుంచీ వెనక్కు రావడం లేదు. వీరిలో రూ.లక్ష చొప్పున చెల్లించిన వారు 55 మంది, రూ.50 వేల చొప్పున చెల్లించిన వారు 106 మంది ఉన్నారు. పిఠాపురంలో 864 టిడ్కో ఇళ్లు నిర్మించగా రూ.10 లక్షలు ఇంకా వెనక్కు రాలేదు. రామచం ద్రపురం మునిసిపాలిటీలో లబ్ధిదారులకు రూ.1.20 కోట్లు రావాల్సి ఉంది. వీరిలో రూ.లక్ష చొప్పున చెల్లిం చిన వారు 92 మంది ఉన్నారు. మండపేట ము నిసిపాలిటీలో రూ.42 లక్షలు, అమలాపురం ముని సిపాలిటీ రూ.40 లక్షలు రావాల్సి ఉంది. తూర్పుగో దావరి జిల్లా నిడదవోలు, కొవ్వూరు మునిసిపాలిటీల పరిధిలో రూ.21 లక్షల వరకు రావాల్సి ఉంది.

  • వస్తాయా..రావా..

లబ్ధిదారులకు వెనక్కు ఇవ్వాల్సిన డబ్బులను అప్ప టి వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వాడేసుకుంది. దీంతో రిఫండ్‌ డబ్బులు ఎవరికీ రాలేదు. ప్రభుత్వం మారిన తర్వాత అనేక మంది బాధితులు ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పిం చాలని కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు సైతం లబ్ధిదారులు తిరుగుతున్నా పనవడం లేదు. ఈ నిధులు లబ్ధిదారులకు వెనక్కి వ్వాలని కలెక్టర్లు,ఎమ్మెల్యేలు సైతం టిడ్కోకు లేఖలు రాసినా ఎలాంటి ప్రయోజనం లేదు. తమ వద్ద ఆ నిధులు లేవని అక్కడి అధికారులు సమాధానం చెబుతున్నారు. దీంతో రిఫండ్‌ డబ్బులపై అయో మయం నెలకొంది. ఇటీవల కాకినాడకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ దృష్టికి అధికారు లు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 01:17 AM