Share News

ఇళ్లివ్వండి బాబు!

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:35 AM

టిడ్కో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు..గత పదేళ్లగా పేదింట కల గంటూనే ఉన్నారు. అయినా నేటికీ కల తీర లేదు..ఇల్లు రాలేదు.

ఇళ్లివ్వండి బాబు!

నేటికి అందని వేలాది ఇళ్లు

గత వైసీపీ నిర్లక్ష్యం.. నిలిచిన టిడ్కో

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

సొంతింటి కోసం తీవ్ర ప్రయత్నాలు

సీఎం గారు ఇవ్వాలని డిమాండ్‌

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

టిడ్కో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు..గత పదేళ్లగా పేదింట కల గంటూనే ఉన్నారు. అయినా నేటికీ కల తీర లేదు..ఇల్లు రాలేదు.గత టీడీపీ హయాంలో నిర్మిం చిన టిడ్కో గృహాలను నిర్మించినా.. వైసీపీ నిర్లక్ష్యం కారణంగా పేదలకు ఇళ్లు అందలేదు. పేదల కనీస అవసరమైన ఇంటి కలను నెరవేర్చడానికి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మించిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికా రంలోకి రావడంతో ప్రజల గూడుకు చీడ పట్టింది. ఈనాటికి లబ్ధిదారులకు దక్కకుండా వృఽథాగా పడి ఉన్నాయి.మొదట్లో టీడీపీ ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొంత మందిని వైసీపీ మార్చేసింది.రుణాలు సరిగ్గా ఇప్పించలేదు.ప్రస్తుతం కూట మి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇటీవల కదలిక వచ్చింది. టిడ్కో ఇళ్లను డిసెంబర్‌ చివరికి లబ్ధిదా రులకు అప్పగించేలా ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది.అయితే ఈ సారైనా ఇస్తారా లేదా అనే మీమాంసలో లబ్ధిదారులు ఉన్నారు. సీఎం చంద్రబాబు తమ గోడు విని గూడు కల్పిం చాలని డిమాండ్‌ చేస్తున్నారు. నేడు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టిడ్కో గృహాలు ఎప్పుడిచ్చేది లేల్చాలని కోరుతున్నారు.

సా..గుతున్న పనులు..

రాజమహేంద్రవరంలో ఏడు ప్రాజెక్టుల కింద 6304 టిడ్కో ఇళ్లు నిర్మించారు. అందులో 5,574 మందికి రిజి స్ర్టేషన్లు పూర్తయ్యాయి.ఇంకా 690 మందికి పెండింగ్‌లో ఉన్నాయి.కానీ మౌలిక సదుపాయాల్లేకపోవడంతో ఇళ్లలో ఉన్నది మాత్రం చాలా తక్కువ మంది. చాలా ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. బొమ్మూరులో మొదటి దశలో 2528 ఇళ్లు నిర్మించారు. తొర్రేడులో 896, మోరంపూడి డిబ్లాక్‌ వద్ద 224, ధవళే శ్వరంలోని వడ్డెర కాలనీలో 256 నిర్మించారు.బొమ్మూరు నిర్మించిన ఇళ్లలో 2528 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా 1977 మంది మాత్రమే తాళాలు తీసుకున్నారు.బొమ్మూరు రెండో దశలో నిర్మించిన 2 వేల ఇళ్లను ఇంకా అప్పగించలేదు. అక్కడ ఎస్‌టీపీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. తొర్రేడులో నిర్మించిన 896 ఇళ్లలో 500 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ధవళేశ్వరం( వడ్డెర కాలనీ)లో నిర్మించిన 256 ఇళ్లలో 234 అప్పగిం చారు. మోరంపూడి డి.బ్లాక్‌లో 224 ఇళ్లు అప్పగించినా కనీస సౌకర్యాలు లేక కేవలం 15 మంది మాత్రమే ఉం టున్నారు. రెండో దశలో నామవరంలో 1104 ఇళ్లు, సిం హాచలనగర్‌లో 96 ఇళ్లు, బొమ్మూరు ఫేజ్‌-2లో 1100 నిర్మించారు.ఇవి ఇంకా పూర్తి కాలేదు. మౌలిక సదు పా యాలు కల్పించలేదు. బొమ్మూరు ఫేజ్‌-2, నామవరం టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు.బొమ్మూరులో ఇళ్లను డిసెంబర్‌ చివరినాటికి లబ్ధిదా రులకు అప్ప గిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతు న్నారు.నామవరంలో చెట్లు తొలగించిన తర్వాత పనులు ఆరంభమ వుతాయి.డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి లబ్ధిదా రులకు ఇచ్చేస్తామని అధికారులు చెబుతున్నారు.

నిడదవోలు, కొవ్వూరులో ఇలా..

నిడదవోలులో 1755 మంజూరు కాగా 1248 ఎంపిక చేసి 1152 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లబ్ధిదా రుల ఎం పిక కూడా పూర్తిగా జరగలేదు.ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. కొవ్వూరు పరిధిలో పేదలకు 480 ఇళ్లు మంజూరు కాగా 480 మొదలు పెట్టారు. ఇళ్ల నిర్మాణం జరిగినా మౌలిక సదుపాయాలు కల్పించక పోవడంతో మొత్తం పెండింగ్‌లో పడింది. ఇక్కడ పనులు ఆపేసిన కాంట్రాక్టరును రద్దు చేసి కొత్త కాంట్రాక్టరు పనులు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు. కొవ్వూరు, నిడద వోలు టిడ్కో ఇళ్లు 2026లోనే ఇవి లబ్ధిదారులకు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

డిసెంబరుకి టిడ్కో ఇళ్లు అప్పగిస్తాం

బొమ్మూరులో పెండింగ్‌ పనులు జరుగుతున్నాయి. తొర్రేడులో డ్రెయిన్‌ నిర్మిస్తు న్నాం. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌కు నీరు సరఫరా చేసే పనులు వేగవంతం అయ్యాయి. నామవరంలో జంగిల్‌ క్లియరెన్స్‌ తీసుకున్నాం. చెట్లు కొట్టిన వెంటనే డ్రైన్‌, రోడ్ల నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేస్తాం. నామవరం, బొమ్మూరు ఫేజ్‌-2 ఇళ్లను డిసెంబర్‌ చివరికి లబ్ధిదారులకు అప్పగిస్తాం. కొవ్వూరు, నిడద వోలు టిడ్కో ఇళ్ల విషయంలో కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త కాం ట్రాక్టర్‌తో ఒప్పందమైన తర్వాతే పనులు ఆరంభిస్తాం.

పి.గంగరాజు, టిడ్కో ఈఈ

Updated Date - Dec 03 , 2025 | 01:35 AM