Share News

మూడు ప్యాకెట్లు.. ఆరు సీసాలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:41 AM

పల్లెల్లో సారా తయా రీ మూడు ప్యాకెట్లు, ఆరు సీసాలుగా సాగుతోంది. రోజు రోజుకూ ఊటలా పెరిగిపో తోంది. చాలా గ్రామాల్లో కుటీర పరిశ్రమగా మారింది. దీన్ని అరి కట్టాల్సిన పోలీసు, ఎక్సైజ్‌ అధికారు లు మిన్నకుండిపోతుండగా... పల్లెవాసులు మత్తులో జోగు తున్నారు.

మూడు ప్యాకెట్లు.. ఆరు సీసాలు

  • గోకవరంలో యథేచ్ఛగా సారా తయారీ

  • కుటీర పరిశ్రమగా మారిన వైనం

  • ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు..

  • పట్టించుకోని పోలీసు, ఎక్సైజ్‌

  • బెల్లం రవాణాపై నియంత్రణే లేదు?

  • కుటుంబాలు ఛిన్నాభిన్నం

గోకవరం, జూన్‌ 12(ఆంధ్ర జ్యోతి): పల్లెల్లో సారా తయా రీ మూడు ప్యాకెట్లు, ఆరు సీసాలుగా సాగుతోంది. రోజు రోజుకూ ఊటలా పెరిగిపో తోంది. చాలా గ్రామాల్లో కుటీర పరిశ్రమగా మారింది. దీన్ని అరి కట్టాల్సిన పోలీసు, ఎక్సైజ్‌ అధికారు లు మిన్నకుండిపోతుండగా... పల్లెవాసులు మత్తులో జోగు తున్నారు.

గోకవరం మండలంలో సారా తయారీ లేని గ్రామం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ నుంచే సారా ఇతర ప్రాంతా లకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికే మద్యం ధర కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో దానివైపే మం దుబాబులు మొగ్గుచూపుతున్నారు. పెళ్లైన వాళ్ల తోపాటు, యువకులు ఈ వ్యసనానికి బానిసల వుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు కుదేల వుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపు తున్న ప్రభుత్వం సారా తయారీ, విక్రయాలకూ కళ్లెం వేయాలని పలువురు కోరు తున్నారు.

  • వేల లీటర్ల తయారీ

మండలంలోని గంగంపాలెం, మల్లవరం, తిరుమలాయపాలెం, వెదురుపాక, ఇటికాయిల పల్లి, కామరాజుపేట, రంపయర్రపాలెం తదితర గ్రామాల్లో నిత్యం వేల లీటర్ల సారా ఉత్పత్తి అవు తున్నట్టు సమాచారం. ఆయా గ్రామాల్లో మందు బాబులకు సరపడా మందు నిల్వ ఉంచుకొని మిగతా దాన్ని మండలంలోని పలు గ్రామాలతో పాటు గండేపల్లి, జగ్గంపేట, కోరుకొండ, రంప చోడవరం, గంగవరం మండలాలకు తరలిస్తు న్నట్టు తెలుస్తోంది.

  • 24 గంటల్లో రెడీ..

గతంలో నల్లబెల్లం, అమ్మోనియా కలిపి వారం, పది రోజుల పాటు ఊరించిన తర్వాత సారా బయటకు వచ్చేది. ఇపుడు ఆ పరిస్థితి లేదు. 24 గంటలు ఊరించిన తరువాత అందు లో ఒక రకమైన పొడి కలిపి సారా కాస్తున్నారు. అలా తయారుచేసిన సారాను తాగితే వెంటనే కిక్కు ఎక్కుతుంది. దీనివల్ల మనిషి నాడీ వ్యవ స్థపై పట్టు కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తి స్తున్నారు. గతంలో సంబంధిత శాఖల అధికా రులు సారీ తయారీ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు అటు వంటి చర్యలేమీ కనిపించడంలేదు. దీంతో సారా తయారీ, విక్రయాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వ్యాపారం సాగుతోంది.

  • తోటల్లో స్థావరాలు

మండలంలోని పలు గ్రామాల్లో మామిడి, జీడి మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఈ తోటలను కొంతమంది సారా వ్యాపారులు ఆవా సాలుగా ఏర్పాటు చేసుకొని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా తోటల్లో పుష్కలంగా నీరు లభించే ప్రాంతాన్ని ఎంచుకొని ఆ దగ్గరిలో జనసంచారం లేని ప్రాంతంలో సారీ తయారీకి ఉపక్రమిస్తున్నారు. అలాగే మల్లవరం, రంపయర్రంపాలెం, తిరుమలాయపాలెం అటవీ ప్రాంతాల్లో కూడా సారా తయారీ మూడు డ్రమ్ములు, ఆరు బకెట్లు తరహాలో సాగుతోంది.

  • బెల్లంపై నియంత్రణ లేక..

సారా తయారీకి అతిమూల పదార్థమైన నల్లబెల్లం, తెల్లబెల్లం రవాణాపై అధికారులు దృష్టి సారించడంలేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో నల్లబెల్లంతోనే సారా తయారీ జరిగేది. నల్లబెల్లంతో తయారుచేసిన సారాను తాగితే కిక్కు ఎక్కువుగా ఉంటుందని మందుబాబులు చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మా రిపోయింది. నల్లబెల్లం సరఫరా తగ్గడంతో గృహ అవసరాల కోసం వినియోగించే తెల్లబె ల్లానే సారా తయారీకీ ప్రస్తుతం ఎక్కువుగా వినియోగించేస్తున్నారు. దీనికితోడు నల్లబెల్లం అయితే సారా దిగుబడికి ఎక్కువ సమయం పడుతుంది. అదే తెల్లబెల్లం వాడితే తక్కువ ఖర్చు అవ్వడంతోపాటు, సారా తయారీ ప్రక్రి య కూడా తొందరగా పూర్తవుతుంది. కిర్లంపూ డి మండలానికి చెందిన ఓవ్యక్తి కేవలం సారా తయారీదారుల కోసం రోజు విడిచి రోజు తెల్ల బెల్లాన్ని టన్నుల కొద్ది గోకవరం తీసుకువచ్చి వ్యాపారం చేయడం గమనార్హం. తెల్లబెల్లం కా వడంతో సదరు వ్యక్తిపై అధికారులు దృష్టి సారించడం లేదు.

Updated Date - Jun 13 , 2025 | 01:41 AM