కేంద్రం అధికారిక ముద్ర!
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:31 AM
రంపచోడవరం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మూడు జిల్లాలుగా ఆవిర్భవించిన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ రెవె న్యూ జిల్లాలకు కేంద్రం ఎట్టకేలకు చట్టబద్ధతను కల్పించింది. 1975 నాటి జోనల్ వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త జోనల్ వ్యవ స్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదంతో హోం మంత్రిత్వశాఖ ద్వారా నోటిఫి కేషన్ జారీ చేయించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పా టైన 26 కొ
అల్లూరి జిల్లా సహా ఉమ్మడి
‘తూర్పు’లోని మూడు జిల్లాలకు చట్టబద్ధత
రాష్ట్రపతి ఆమోదంతో కొత్త జోనల్ వ్యవస్థ
నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాలకు కేంద్రం ఆమోదం
రంపచోడవరం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మూడు జిల్లాలుగా ఆవిర్భవించిన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ రెవె న్యూ జిల్లాలకు కేంద్రం ఎట్టకేలకు చట్టబద్ధతను కల్పించింది. 1975 నాటి జోనల్ వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త జోనల్ వ్యవ స్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదంతో హోం మంత్రిత్వశాఖ ద్వారా నోటిఫి కేషన్ జారీ చేయించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పా టైన 26 కొత్త జిల్లాలను కేంద్రం ఆమోదించింది. 2022లోనే రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటికి కేంద్రం ఆమోదముద్ర వేయకపోవడంతో ఇంకా పాత జోనల్ వ్యవస్థలోని 13 జిల్లాలనే పరిగణలోనికి తీసుకుని పాలన సాగిస్తున్నారు. ఈ కారణం గానే స్థానిక సంస్థల పాలన కూడా ఉమ్మడి జిల్లాల పరిషత్తులుగానే కొనసాగు తున్నాయి. ఆయా శాఖల పరిపాలన, బదిలీలు తదితర అంశా లన్నీ ఉమ్మడి జిల్లాల అధిపతుల ద్వారానే సాగుతూ వచ్చాయి. ఈ విధానం పాల నాపరంగా అనేక చిక్కులను తెచ్చిపెడుతోందని కూటమి ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తేవడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి కొత్త జోనల్ వ్యవస్థను 26 కొత్త జిల్లాల పరిధిల ప్రామాణికంగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ను తేవడమే కాకుండా తక్షణం అమలులోకి తెచ్చింది. ఈ కొత్త జోనల్ వ్యవస్థ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆవిర్భవించిన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి విశాఖ మ న్యంలోని పాడేరు డివిజనుతో పాటు రంప చోడవరం-చింతూరు డివిజన్లు కలిసి ఉన్న అల్లూ రి జిల్లాలకు రెండో జోన్లో జిల్లాలుగా గుర్తింపు లభించింది. ఇంతవరకూ పేరుకే జిల్లాలుగా ఉన్న ఈ నాలుగు జిల్లాలు కొత్త జోన్ల ఏర్పాటు ద్వారా చట్టబద్ధతను పొందాయి.
కొత్త జిల్లా పరిషత్తుల ఏర్పాటుకూ లైన్ క్లియర్
కొత్త జిల్లాలకు కేంద్రం నుంచి చట్టబద్ధతతో గుర్తింపు దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషతు స్థానే మూడు కొత్త జిల్లాలకు పరిషత్తులను ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయినట్టే! త్వరలోనే ఉమ్మడి 13 జిల్లాల పరి షత్తుల పాలకవర్గాలకు గడువు ముగుస్తుండ డంతో వాటి స్థానే తిరిగి జిల్లా పరిషత్తు పాలక వర్గాలను స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే 2022లోనే ఈ కొత్త జి ల్లాలు ఏర్పాటు జరిగినా చట్టబద్ధత కొరవడడ ంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు గానే మూడు కొత్త జిల్లాలు, అల్లూరి జిల్లా పరిష త్తులోని 11 మండలాలు కొనసాగుతూ వచ్చా యి. కాగా ఈనెల 15తో కేంద్ర నోటిఫికేషన్ ద్వా రా కొత్త జిల్లాలు ఏర్పాటైనట్టే అయింది. దీంతో ఉమ్మడి జిల్లాల పరిషత్తులు దాదాపుగా రద్దయి నట్టే భావించాల్సి వసోంది. ఈ తరుణంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జిల్లా పరిషత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇదే జరిగితే ఈ 3 కొత్త జిల్లాలకు, అల్లూరి జిల్లాకు జిల్లా పరిషత్తు చైర్మన్ల పోస్టులు, వైస్ చైర్మన్ పోస్టులూ దక్కుతాయి. తద్వారా ప్రధాన రాజకీయ పక్షాల నేతలకు మరిన్ని కీలక పదవులు దక్కనున్నాయి.
రంపచోడవరం జిల్లా అల్లూరి జిల్లా పరిధిలోనేనా?
కొత్త జోనల్ వ్యవస్థ మేరకు ప్రస్తుతం అల్లూరి జిల్లా పరిధిలోకి చేరిన రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిని కొత్తగా రంపచోడ వరం(పోలవరం) జిల్లాగా ప్రభుత్వం ప్రకటిం చిన సంగతి తెలిసిందే! కాగా దీనికి గెజిట్ జారీ కావడం, జిల్లా ఏర్పాటు కావడం నిర్దేశిత జిల్లాల పునర్విభజన చట్టం కింద జరుగుతుంది కాగా అది చట్ట ప్రకారం జరిగినా, దీనికి కూడా కేంద్రం నుంచి మళ్లీ ఆమోదం రావాల్సి ఉంటుంది. ఈ రంపచోడవరం (పోలవరం) జిల్లా ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై మళ్లీ ఒత్తిడి తెచ్చి కొత్త జోన్‌ల్ వ్యవస్థలో పలు సవరణలను తీసుకురావాల్సి ఉంటుంది. అప్పటివరకూ కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం జోన్-2లోని అల్లూరి సీతారామరాజు జిల్లాగానే ఇది కొనసాగాల్సి ఉంటుంది. పాలనా వ్యవహరాలు అన్నీ అల్లూరి జిల్లాగానా ఆ జోన్ పరిధిలోనే సాగుతాయి.