మువ్వన్నెల రెపరెపలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:21 AM
భారతదేశ 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద జా తీయ పతాకాలను ఆవిష్కరించి, దేశ భక్తి గీతాల ను ఆలపించారు.దీనిలో భాగంగా పలువురు చి న్నారుల భరతమాత, గాంధీజీ, సుభాష్ చంద్ర బోస్ వేషధారణల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్శణ గా నిలిచాయి.
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆకట్టుకున్న సాంస్కృతి ప్రదర్శనలు
విద్యార్థులకు బహుతుల ప్రదానం
రాజానగరం, ఆగస్టు 15: భారతదేశ 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద జా తీయ పతాకాలను ఆవిష్కరించి, దేశ భక్తి గీతాల ను ఆలపించారు.దీనిలో భాగంగా పలువురు చి న్నారుల భరతమాత, గాంధీజీ, సుభాష్ చంద్ర బోస్ వేషధారణల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్శణ గా నిలిచాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. రాజానగరం లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. మండ ల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని ఎంఈ వో, వెలుగు, వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయా లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ పతా కాన్ని ఎంపీపీ మండారపు సీతారత్నం ఆవిష్క రించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీ ల్దార్ జీఏఎల్‌ఎస్ దేవి, పోలీస్ స్టేషన్ వద్ద సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ జాతీయ పతాకాతా లను ఆవిష్కరించారు. గోదావరి గ్లోబల్ విశ్వవి ద్యాలయం (జీజీయూ) ప్రాంగణంలోని కళాశాల ల్లో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. చాన్స లర్, చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కేవీవీ సత్యనా రాయణరాజు జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గైట్ ప్రాంగణంలోని వివి ధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొ న్నారు. తూర్పుగోనగూడెంలోని ఐఎస్‌టీఎస్ మ హిళా ఇంజనీరింగ్ కళాశాలలో చైర్మన్ కళ్లెం ఉపేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. రాజానగరంలో కెఎల్‌ఆర్ లెనోరా దంత వైద్య కళాశాలలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వ హించారు. జీఎస్‌ఎల్ వైద్య విద్యాసంస్థల ప్రాంగణంలో చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాం స్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. అలాగే కానవరంలోని గాయత్రి విద్యా సంస్థలు, రాజానగరంలోని దివ్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. విద్యార్థు లకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ మూ ర్తి,ప్రిన్సిపాల్ దేవిబంగారం, బర్ల సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.