Share News

దాహం.. దాహం..

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:20 AM

ప్రస్తుత మండు వేసవిలో తమకు తాగడానికి గుక్కెడు గోదావరి జలాలను సత్యసాయి మం చినీటి పథకం ద్వారా పంపిణీ చేయాలని కోరుకొండ మండలంలోని 10గ్రామాలకు చెందిన ప్రజలు ముక్తకంఠంతో ఇటు ప్రజాప్రతినిధులను, అటు అధికారులను వేడుకుంటున్నారు.

దాహం.. దాహం..
20 రోజులుగా తాగునీరు లేని సత్యసాయి వాటర్‌ ట్యాంకులు

  • సక్రమంగా పనిచేయని సత్యసాయి మంచినీటి పథకం

  • ప్రతి నెలా ఏదొక సమస్య

  • 20 రోజులుగా తాగునీటి ఇబ్బందులు

  • ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లకు పెరుగుతున్న డిమాండ్‌

కోరుకొండ, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత మండు వేసవిలో తమకు తాగడానికి గుక్కెడు గోదావరి జలాలను సత్యసాయి మం చినీటి పథకం ద్వారా పంపిణీ చేయాలని కోరుకొండ మండలంలోని 10గ్రామాలకు చెందిన ప్రజలు ముక్తకంఠంతో ఇటు ప్రజాప్రతినిధులను, అటు అధికారులను వేడుకుంటున్నారు. సత్యసాయి మంచినీటి పథకం ద్వారా గోదావరి తాగునీటి జలాలు 6నెలలుగా సక్రమంగా రావడంలేదు. కనీసం 20 రోజులకు ఒక్క సారి కూడా తాగునీరు రావడం లేదు. ఒక నెలలో సిబ్బందికి జీతాలు లేవని, మరో నెలలో పైపు లు పగిలాయని, ఇంకో నెలలో వి ద్యుత్‌ సమస్య అని ఇలా ప్రతి నెలా ఏ దొక సమస్య చెబుతున్నారు. మార్చి లో రెండు సార్లు, ఏప్రిల్‌లో రెండు సార్లు, మే నెలలో రెండు రోజులు మాత్రమే మంచినీళ్లు ఇచ్చారు. ప్రస్తుతం జూన్‌లో 14 రోజులు గడుస్తున్నా సత్యసాయి పథకం ద్వారా గ్రామాల్లో తాగు నీరు అందించడం లేదు. ఈ క్రమంలో 6 నెలల కాలంలో ప్రైవేట్‌ మంచి నీటి వ్యాపారం విపరీతంగా పెరిగింది. గోదావరి జలాలు రాకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తులు అమ్మే మినరల్‌ వాటర్‌ను కొనుగోలు చేసుకోవడం తప్ప ప్రజ లకు గత్యంతరం లేదు. ఈ నేపథ్యంలో మండలంలో మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అన్ని గ్రామాల్లోను 2, 3 ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌లు వెలిశాయి. కాగా ప్రతి గ్రామంలో రెండు మూడు మంచి నీటి ట్యాంకులు ఉండి కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సక్రమంగా తాగు నీటిని సరఫరా చేయలేకపోతోందని మండల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి సత్యసాయి మంచినీటి పథకం ద్వారా గోదావరి జలాలను సరఫరా చేయాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:20 AM