40 ఏళ్ల తర్వాత కలిశారు!
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:11 AM
స్థానిక స్టేడియం రోడ్డులోని డీఎం హైస్కూల్ 1984-85 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం స్కూలు ఆవరణలో సందడిగా, సరదాగా జరిగింది. 40 సంవత్సరాల తరువాత ఒక్కటైన పూర్వ విద్యార్థులు తమ తరగతి గదులను సందర్శించి, నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రాజమహేంద్రవరం కల్చరల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): స్థానిక స్టేడియం రోడ్డులోని డీఎం హైస్కూల్ 1984-85 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం స్కూలు ఆవరణలో సందడిగా, సరదాగా జరిగింది. 40 సంవత్సరాల తరువాత ఒక్కటైన పూర్వ విద్యార్థులు తమ తరగతి గదులను సందర్శించి, నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అంత ర్జాతీయ ఉపాఽధ్యాయ దినోత్సవం సందర్భంగా,పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. తమ స్నేహితుల్లో పలువురు ఉన్నత స్థితిలో ఉన్నారని, పూర్వ విద్యార్థి కొమ్ము పాపారావు అన్నారు. తమ బ్యాచ్‌లో కొందరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారని, వారికి మిగతా వారు తమ వంతు సాయం అందించడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నీలాద్రి వెంకటేశ్వరరావు, మావూరి శ్రీను, అక్కిరెడ్డి గోవింద రాజు, వాయు నందనరావు తదితరులు పాల్గొన్నారు.