Share News

యూరియా కొరత లేదు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:31 AM

రాజానగరం మండల పరిధిలో యూరియా కొరత లేదని రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణ నాయక్‌ స్పష్టం చేశారు. రాజానగరం, తోకాడ గ్రామాల్లోని సొసైటీల వద్ద ఎరువుల నిల్వలను ఆయన గురువారం పరిశీలించారు.

యూరియా కొరత లేదు
రాజానగరంలో ఎరువుల నిల్వలను తనిఖీ చేస్తున్న ఆర్డీవో కృష్ణ నాయక్‌

  • రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణ నాయక్‌

  • రాజానగరంలో ఎరువుల నిల్వల పరిశీలన

రాజానగరం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాజానగరం మండల పరిధిలో యూరియా కొరత లేదని రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణ నాయక్‌ స్పష్టం చేశారు. రాజానగరం, తోకాడ గ్రామాల్లోని సొసైటీల వద్ద ఎరువుల నిల్వలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ ప్రస్తుతం యూరియా నిల్వ 19.62 మెట్రిక్‌ టన్నులు ఉండగా రైతు సేవా కేంద్రాల్లో(ఆర్‌ఎస్‌కేఎస్‌) అదనంగా 2.20 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంద న్నారు. రైతులకు యూరియా సరఫ రాలో ఎలాంటి జాప్యం తలెత్తకుం డా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించామన్నారు. ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏవో ఎ.కళ్యాణ్‌ సూర్యకుమార్‌, డీటీ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:31 AM