తల్లికి.. పరీక్ష!
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:35 AM
‘తల్లికి వందనం’ పథకం..తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు.

వందనం..వదలం
ఉమ్మడి జిల్లాలో భారీగా అర్జీలు
సచివాలయాల వద్ద అనర్హుల క్యూ
11,500 మందికి పైగా దరఖాస్తులు
కాకినాడ జిల్లాలోనే 5,200 అర్జీలు
అధిక విద్యుత్ బిల్లుల అర్జీలు 4,500
అర్జీల రీవెరిఫికేషన్ చేయిస్తోన్న ప్రభుత్వం
కారు, ఐటీ కారణంతో 2వేలకుపైగా అర్జీలు
మీటర్ల సీడింగ్ అర్జీలపై ట్రాన్స్‌కో దృష్టి
జూలై 5న రెండో విడత జమ
(కాకినాడ/ రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి)
‘తల్లికి వందనం’ పథకం..తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్ స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఎవరు ఏ సమస్య వల్ల అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించడంతో వాటి ఆధారంగా తగు పత్రాలను జతచేసి గ్రీవెన్స్‌కు దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ క్రమంలో జతచేయాల్సిన పత్రాల కోసం కార్యా లయాల చుట్టూ తల్లులు చక్కర్లు కొడుతున్నారు.
‘తల్లికి వందనం’ పథకం తమకు వర్తింపజేయా లంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలల్లో అర్జీలు పోటె త్తుతున్నాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ వేలాది తల్లు లు సచివాలయాలకు క్యూకడుతున్నారు. ఎప్పుడో కారు విక్రయించేసినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు.. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూ పించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్‌కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హు లుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 11,500 మంది తల్లులు అర్జీలు దాఖలు చేశారు. వీరిలో అర్హులుంటే వచ్చేనెల 5న తిరిగి ప్రభుత్వం డబ్బులు జమచేయనుంది. ఈనేపథ్యంలో అధికారులు మళ్లీ ఈ అర్జీలను పునఃపరిశీలిస్తున్నారు. అర్హుల వివ రాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపుతున్నారు.
ఇప్పటికే 3.85 లక్షల ఖాతాల్లో జమ
తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న అమలుచేసింది. కాకినాడ జిల్లాలో 2,28,781 మంది విద్యార్థులకు సంబంధించి 1,49,403 మంది తల్లుల ఖాతాల్లో రూ.297 కోట్లు, కోనసీమ జిల్లాలో 1,70,869 మంది విద్యార్థులకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.222 కోట్లు, తూర్పు గోదా వరి జిల్లాలో 1,88,726 మంది విద్యార్థులకు సంబం ధించి 1,23,779 మంది తల్లుల ఖాతాల్లో రూ.245 కో ట్లు ఉమ్మడి జిల్లాలో 5,88,378 మంది విద్యార్థులకు సంబంధించి 3,85,601 మంది తల్లుల ఖాతాల్లో రూ. 764 కోట్లు వారి ఖాతాలకు చెల్లించింది. దీంతో తల్లు ల్లో పట్టరాని ఆనందం వ్యక్తమైంది. గత వైసీపీ ప్రభు త్వంలో అమ్మఒడి పేరుతో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులు జమ చేయగా.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలుం టే అంతమందికీ డబ్బులు జమయ్యాయి. అనేక మం డలాల్లో ఒకే కుటుంబంలో ఐదుగురు పిల్లలున్న తల్లులకు ఏకంగా రూ.65 వేల వరకు పడ్డాయి. ఇలా తల్లికి వందనం పథకం ఉమ్మడి జిల్లాలో లక్షల మంది తల్లులకు ఆర్థికంగా ఎంతో భరోసా నింపింది.
ఉమ్మడి జిల్లాలో 11,500 అర్జీలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,271 సచివాలయాల పరిధిలో 11,500 అర్జీలు పోటెత్తాయి. ఒక్క కాకినాడ జిల్లాలోని 620 సచివాలయాల పరిధిలో 5,200 వర కు అర్జీలు వచ్చాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేయడం విశేషం. తమ పేరుపై అనేక విద్యుత్ మీటర్లు సీడిం గ్ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క కాకినాడ జిల్లా ట్రాన్స్‌కో పరిధిలో సీడింగ్ సమస్య అర్జీలు 1,100 వరకు ఉండగా, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో 1,400 వరకు ఉన్నాయి. తమ కారు విక్రయించేసినా పథకం అమలుకాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించా రు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివా హం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదా యం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబం ధించి అనేకమంది అర్జీలు దాఖలు చేశారు.
క్షుణ్ణంగా పరిశీలన..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వచ్చిన అర్జీలను ఎప్పటి కప్పుడు ఆయా సచివాలయాలు పరిశీలిస్తున్నాయి. కారు సంబంధిత అర్జీ సమస్యను ఆయా జిల్లా రవా ణా శాఖకు నేరుగా సచివాలయాలు పంపి ఆరా తీస్తు న్నాయి. ఇలా ఇప్పటివరకు 250కిపైగా అర్జీలను మూడు జిల్లాల్లో డీటీసీలకు పంపారు. వీటిని డీటీసీ లు పరిశీలించి అర్హులో కాదో తేల్చి నేరుగా అమరా వతికి తమ లాగిన్‌లో పంపుతున్నారు. ఆదాయపు పన్ను అర్జీలను తహశీల్దార్లకు లాగిన్‌లో పంపుతు న్నారు. వీటిని తహశీల్దార్లు పరిశీలించి ఆదాయపు పన్ను పరిధిలో లేని వారిని నిర్ధారించి ఆర్డీవోలకు లా గిన్ ద్వారా పంపుతున్నారు. వీటిని ఆర్డీవోలు మరో సారి పరిశీలించి ఆయా జిల్లాల జేసీలకు పంపుతు న్నారు. ఇలా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 150 అర్జీలకే తిరిగి పథకం ఇవ్వొ చ్చని తేల్చారు. విద్యుత్ బిల్లులకు సంబంధించిన అర్జీ లు మాత్రం అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరికి పథకం వర్తించదని నిర్ధారించి సచివాలయాల దశలో నే రెండోసారి అనర్హత కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ నెలాఖరులోగా అర్హుల జాబితా పూర్తిచేయనున్నారు.
ధ్రువీకరణ పత్రాలకు ఇక్కట్లు
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,89,183 మందిని అర్హులుగా గుర్తించగా 44243 మంది అనర్హుల జాబి తాలో ఉన్నారు. కోరుకొండ మండలాల్లో 55 ప్రభు త్వ, 45 ప్రైవేట్ పాఠశాలల్లో 12,600 మంది విద్యార్థులు ఉన్నారు.సుమారు 2550 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. అన ర్హత జాబితాలో ఉన్న వాళ్లు సచివాలయాలు, పాఠశా లల చుట్టూ తిరుగుతున్నారు. గ్రీవెన్స్ దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యం అవుతుండడంతో ఇంకా సగం మందికిపైగా సవరణ/ ఫిర్యాదు దరఖాస్తులు సమ ర్పించాల్సి ఉం దని తెలుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలల్లో అనర్హులుంటే కేవలం 11,500 అర్జీలు రావడమే అందుకు ఉదాహ రణ. సచివాలయ సిబ్బందికి తల్లికి వందనం గ్రీవె న్స్‌పై అవగాహన లేకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.