పాఠ్య పుస్తకాలు పక్కదారి!
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:09 AM
ప్రభు త్వం విద్యార్థులకు అందజేస్తున్న పాఠ్యపుస్తకాల పంపిణీ పక్కదారి పడుతోంది. అర్హులకు అందాల్సిన పుస్తకాలు అర్హత లేనివారి చేతికి వెళ్లిపోతున్నాయి. విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పాఠ్య పుస్తకాల పంపిణీ ఏలేశ్వరం పట్టణం, రూరల్‌లో సక్రమంగా జరగడంలేదు.

లోపించిన విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ
ఏలేశ్వరం, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం విద్యార్థులకు అందజేస్తున్న పాఠ్యపుస్తకాల పంపిణీ పక్కదారి పడుతోంది. అర్హులకు అందాల్సిన పుస్తకాలు అర్హత లేనివారి చేతికి వెళ్లిపోతున్నాయి. విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పాఠ్య పుస్తకాల పంపిణీ ఏలేశ్వరం పట్టణం, రూరల్‌లో సక్రమంగా జరగడంలేదు. పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి స్థాయిలో విద్యార్ధులకు పుస్తకాలు చేర్చాలని ప్ర భుత్వ నిర్ణయం. కానీ అధికారుల అనాలోచన నిర్ణయాలతో పలు పుస్తకాలు చేరాల్సిన వారికి అందడంలేదు. మండలంలోని పట్టణం, రూరల్‌లో 40 పాఠశాలలు ఉన్నాయి. వీటికి సరఫరా చేసేందుకు ప్రభుత్వం 22,965 పాఠ్యపుస్తకాలను.. 37,247 నోట్ పుస్తకాలను సమకూర్చింది కా నీ ఆయా పాఠశాలలకు పుస్తకాలను చేర్చేపనులు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కాలంగా పాఠ్య పుస్తకాల సరఫరా సక్ర మంగా జరగడంలేదని వి మర్శలు వస్తున్నాయి. వి ద్యా సంవత్సరం సగం పూర్తయినా గానీ పిల్లలకు పుస్తకాలు అందని స్థితి గతేడాది నెలకొంది. ఈమారు ఇదే తరహాలో వ్యవహార శైలి కొనసాగుతుందని పలు వురు ఆరోపిస్తున్నారు. పాత పుస్తకాలు కూడా నల్లబజారుకు తరలిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు ప్రయివేటు పాఠశాలకు తరలి వెళ్తు న్నాయని విమర్శలు వస్తున్నాయి.