Share News

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల మారణకాండకు ఖండన

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:08 AM

భారతదేశం అభివృద్ధి పథంలో దూసుపోతుంటే ఓర్వలేని పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దేశంలో అల్ల ర్లు సృష్టించారని, పెహల్గాంలో జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. శుక్రవారం సీతానగరం పాత బస్టాండ్‌ సెంటర్‌లో కూట మి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నల్ల బ్యాడ్జిలు ధరించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల మారణకాండకు ఖండన
సీతానగరంలో నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే బత్తుల

  • ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

  • పలుచోట్ల నిరసన కార్యక్రమాలు

  • ర్యాలీలు, మానవహారాలు

సీతానగరం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) భారతదేశం అభివృద్ధి పథంలో దూసుపోతుంటే ఓర్వలేని పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దేశంలో అల్ల ర్లు సృష్టించారని, పెహల్గాంలో జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. శుక్రవారం సీతానగరం పాత బస్టాండ్‌ సెంటర్‌లో కూట మి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నల్ల బ్యాడ్జిలు ధరించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో పెందుర్తి అచ్యుత రామారావు, గెడ్డం తిమ్మారావు, పోలిన కృష్ణ, దూలం కృష్ణ, బీజేపీ మండలాధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మి, మద్దాల కొండలరావు, అంబటి వెంకటరమణ సీపీఐ ఎంల్‌ నాయకుడు పలివెల వీరబాబు, మట్టా వెంకటేశ్వరరావు. జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 01:08 AM