Share News

ఘనంగా విశ్వేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:09 AM

వాడపల్లి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వార్షిక కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా విశ్వేశ్వరస్వామి కల్యాణం

ఘనంగా విశ్వేశ్వరస్వామి కల్యాణం

ఆత్రేయపురం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వార్షిక కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. సోమవారం రాత్రి 7 గంటలకు గణపతి పూజ, పుణ్యహ వచనం, అంకుర్పారణ, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను జరిపారు. అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి కల్యాణా న్ని ఘనంగా నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ఉపకమిషనరు నల్లం సూర్యచక్ర ధరరావు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొ న్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో స్వామివార్ల కల్యాణాన్ని వైభవంగా జరిపారు.

Updated Date - Mar 11 , 2025 | 01:09 AM