Share News

కేశవస్వామికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:34 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం స్వామివారికి ప్రత్యేక అర్చన, తులసీపూజ, అమ్మవార్లకు కుంకుమార్చన జరిపారు.

కేశవస్వామికి ప్రత్యేక పూజలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం స్వామివారికి ప్రత్యేక అర్చన, తులసీపూజ, అమ్మవార్లకు కుంకుమార్చన జరిపారు. అధిక సంఖ్య లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం నిత్యోపాసన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వర కళాకారుల బృందం ఆధ్వర్యంలో తోలుబొమ్మలాల ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని విరాళాలు అందించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఏర్పాట్లు నిర్వహించారు.

Updated Date - Apr 10 , 2025 | 01:34 AM