సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - May 26 , 2025 | 12:58 AM
అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం భక్తులతో కిటకిట లాడింది. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
అయినవిల్లి, మే 25(ఆంధ్రజ్యోతి): అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం భక్తులతో కిటకిట లాడింది. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
అన్నదాన ట్రస్టుకు విరాళాలు: అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. రాజమహేంద్రవరానికి చెందిన కురిశెట్టి చంద్రశేఖర్‌గుప్త, ప్రత్యూష దంపతులు విఘ్నేశ్వరస్వామిని దర్శించుకుని అన్నప్రసాద్ ట్రస్టుకు రూ.50,409 విరాళం ఇచ్చారు. పేరూరుకు చెందిన ఉపాధ్యాయుల భానుప్రియ అన్న ప్రసాదానికి రూ.10,116 విరాళంగా అందజేశారు. విజయవాడకు చెందిన జి.పృథ్వీరాజ్, జ్యోతిర్మయి దంపతులు అన్నప్రసాద ట్రస్టుకు రూ.10,116 విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ ప్రధానార్చకులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు.