Share News

పులిమచ్చల టేకు చేప చిక్కింది..

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:43 AM

అంతర్వేది, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. డాక్ట ర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది

పులిమచ్చల టేకు చేప చిక్కింది..
అంతర్వేది మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారులకు చిక్కిన పులిమచ్చల టేకు చేప

అంతర్వేది, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. డాక్ట ర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారులకు సుమారు పది కిలోల పులిమచ్చల టేకు చేప పాట దొరకగా వేలం పాట నిర్వహించారు. దీనిని స్థానికులు వింతగా చూశారు. ఈ చేప పొట్ట భాగంలో, బ్లాడర్‌లో ఔషధ గుణాలు ఉండడంతో ఎక్కువగా మందుల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. ఈ చేప ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూనే ఉంటుందని, అప్పుడప్పుడు చిక్కుతూ అదృష్టం తెచ్చిపెడుతుందన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:43 AM