Share News

టె‘ట్‌’న్షన్‌!

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:18 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో మాస్టారికి టెన్షన్‌ తప్పడంలేదు..

టె‘ట్‌’న్షన్‌!

పరీక్ష రాయాలంటున్న సుప్రీం కోర్టు

రాయలేమంటున్న ఉపాధ్యాయులు

మినహాయింపునకు డిమాండ్‌

ఉమ్మడి జిల్లాలో టీచర్లు14 వేలు

3 వేల మంది మాత్రమే దరఖాస్తు

11 వేల మంది సంగతేంటో మరి

ఉపాధ్యాయులకు విషమ పరీక్ష

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో మాస్టారికి టెన్షన్‌ తప్పడంలేదు.. ఎలా రాయగ లం.. ఏం రాయగలం అంటూ ఆందోళన చెందు తున్నారు. ఎప్పుడో వదిలేసిన పుస్తకాల్లో ప్రశ్న లు ఇచ్చి రాయమంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాఽధ్యాయు లంతా టెట్‌ టెన్షన్‌లో ఉన్నారు.. ఇప్పుడే పరీక్ష రాయ లేం అంటూ చేతులెల్తేస్తున్నారు. 2012కు ముందు టీచర్‌ ఉద్యోగాలు పొందినవారంటే..వారి కనీస సర్వీ సు 15 ఏళ్లు. ఇరవై ఏళ్లకు పైగా టీచర్లుగా కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో చాలా మంది వయసు 50 ఏళ్లు దాటింది. ఈ వయసులో కొత్తగా టెట్‌ రాయడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌కు ఒకే పేపరుతో టెట్‌ జరుగుతుం ది. కానీ ఈ సబ్జెక్టులకు టీచర్లు వేర్వేరుగా ఉంటారు. వారి సంబంధిత సబ్జెక్టు నుంచి 20 మార్కులకే ప్రశ్నలు వస్తా యి. టెట్‌ అర్హత సాధించాలంటే 150 మార్కులకు ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు రావాలి. వృత్తిపరంగా ఇన్నేళ్ల అనుభవం ఉన్న టీచర్లు టెట్‌ ఎందుకు ఉత్తీర్ణత సాధించలేరని కొం దరు ప్రశ్నిస్తున్నారు. అయితే టీచర్లు మాత్రం ఎప్పుడే వదిలేసిన పుస్తకాల్లో ప్రశ్నలు ఎలా రాయగలమంటూ ఆందోళన చెందుతుతున్నారు.

ఉమ్మడి తూర్పులో 10 వేల మంది

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 14 వేల మంది వరకూ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నా రు. వీళ్లలో మినహాయింపు కోటాలో వెయ్యి మంది వరకూ ఉండగా 3 వేల మంది టెట్‌కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సుమారు 11 వేల మంది టెట్‌లో రెండేళ్లలో కచ్చితంగా అర్హత సాధించాల్సిందే. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల లోపు దూరంలో ఉన్న వాళ్లు టెట్‌ రాయన వసరం లేదంటూనే ఉద్యోగోన్నతికి దగ్గరలో ఉంటే మాత్రం రాయాల్సిందే అనే మెలిక పెట్టారు. 2012కి ముందు టెట్‌ లేదు. విద్యార్హతలు, పోటీ పరీక్షల ఆధారంగా నియా మకాలు జరి గేవి. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వాళ్లు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించేవారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు ఇస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే టెట్‌ అర్హత సాధించాల్సిం దేనని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న అధిక శాతం మంది ఉపాధ్యాయులకు గుండెల్లో ఆందోళనకు కారణమైంది. టెట్‌ అర్హత ధ్రువ పత్రం జీవితకాలం పని చేస్తుంది.దీంతో ఆ పత్రం లేకపోతే ఉద్యోగం ఊడబీకే అవకాశం ఉండడంతో మరింత ఆవేదనకు గురిచేస్తోంది. దీంతో టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

టెట్‌ అంటే

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ-టెట్‌) అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావడానికి అవసరమైన తప్పని సరి అర్హత పరీక్ష. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌ కావాలంటే ఆ పరీక్షలో అర్హత సాధిం చాల్సిందే.ఈ పరీక్ష పాసైతేనే టీచర్‌ ఉద్యోగానికి దర ఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమా ణాలను మెరుగు పరచడం, నియామక ప్రక్రియలో నాణ్యతను పెంచడానికి 2011లో విద్యాహక్కు చట్ట ప్రకారం టెట్‌ని అమ ల్లోకి తీసుకురాగా మొదటిసారి 2012లో టెట్‌ని నిర్వహించారు. అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా టెట్‌ నిర్వహిస్తున్నారు.

పరీక్ష ఎలా రాయగలం..

ఉపాధ్యాయ వృత్తిలో రోజూ తరగతి గదిలో పాఠాలు చెబుతూనే ఉంటారు కదా! ఇప్పుడు అర్హత పరీక్షలో అలవోకగా పాసైపోతారుగా.. మరి ఇబ్బంది ఏమిటి అనే సందేహం రాక తప్పదు. అయితే దీనిలోనే అసలు చిక్కుముడి ఉంది. 2012కి ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వాళ్లకు ఇప్పటికి సుమారు 20 ఏళ్ల సర్వీసు,అంతకంటే ఎక్కువ పూర్తయినవాళ్లు అధికశాతం ఉన్నారు. వాళ్లు ఇన్నేళ్లుగా చెబుతున్న సబ్జెక్టు మాత్రమే కాకుండా ఎప్పుడో డిగ్రీలో చదివిన, చదవని వాటిలోని ప్రశ్నలను ఇప్పుడు ఎదుర్కోవాలంటే విషమపరీక్షే కదా అని టీచర్ల వాదిస్తున్నారు.టెట్‌ పేపర్‌లోని ప్రశ్నల్లో తాను ఇన్నేళ్లుగా బోధిస్తున్న సబ్జెక్టుకు సంబంధించి కేవలం 20 మార్కులు సాధించుకొనే అవకాశం మాత్ర మే ఉంటుంది. ఎందుకంటే అంతకుమించి జవాబులు రాయడానికి ప్రశ్నలు ఇవ్వరు. అర్హత మార్కులు రాకపోతే అంతే పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆందోళనకు సన్నద్ధం

ఈ విధానంపై ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్త ఆందో ళనలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి కూడా జన వరిలో ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు దాదాపుగా నిర్ణ యానికి వచ్చాయి. విద్యాహక్కు చట్టంలో పార ్లమెంట్‌లో సవరణ ద్వారా 2011 తర్వాత నియ మితులైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్‌లో అర్హత తప్పనిసరి అని స్పష్టం చేస్తే తప్ప ఈ సమ స్యకు పరిష్కారం దొరక్కపోవచ్చు.

Updated Date - Dec 23 , 2025 | 01:18 AM