Share News

రెడీఎస్సీ!

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:36 AM

ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక తుది జాబితా సిద్ధమైంది.

రెడీఎస్సీ!

మొత్తం 1241 పోస్టులు

16,17న వెబ్‌ ఆప్షన్లు స్వీకరణ

19న ఉత్తర్వులు విడుదల

20,21న జాయినింగ్‌

(కాకినాడ/రూరల్‌-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక తుది జాబితా సిద్ధమైంది. ఇప్పటికే ఎంపికైన డీఎస్సీ అభ్యర్థుల వివరాలు వెల్లడించి వారి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తుది జాబితాలను సోమవారం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ జ్ట్టిఞట: //్చఞఛీటఛి.్చఞఛిజటట.జీుఽలో అందుబాటులో ఉంచనున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ-2025 రిక్రూట్‌మెంట్‌ ముగింపు దశకు చేరుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1241 పోస్టులు ఉన్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాలలో గత నెల 28 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఏడు విడతల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. అందుబాటులో ఉన్న ఖాళీలకు పోస్టింగ్స్‌ కేటాయింపుపై 16,17 తేదీల్లో వెబ్‌ ఆప్షన్‌ స్వీకరించి 19న ఉత్తర్వులు జారీ చేస్తా రు. నియామకపత్రాలు పొందిన కొత్త టీచర్లు వారికి కేటాయించిన పాఠశాలల్లో 20,21 తేదీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. 22 లేదా 23 నుంచి దసరా సెలవుల్లో శిక్షణ ఉం టుంది.శిక్షణ బృందాలను సిద్ధం చేశారు.

పోస్టులు ఇవీ..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా డీ ఎస్సీలో 1241 పోస్టులు ఉండగా 63,004 దరఖాస్తులు వచ్చాయి.38,617 మంది పరీక్షలు రాశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ 608, పీఈటీలు 210, ఎస్జీటీ 423 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు తెలుగు 65, హిందీ 78, ఇంగ్లీష్‌ 95, గణితం 64, ఫిజికల్‌ సైన్స్‌ 71, బయోలాజికల్‌ సైన్స్‌ 103, సోషల్‌ 132, వ్యాయామ విద్య 210 ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమానికి సంబంధించి ఫిజికల్‌ సైన్స్‌ 3, బయోలాజికల్‌ సైన్స్‌ 4, స్కూల్‌ అసిస్టెంట్‌ వ్యాయామ విద్య 1, ఎస్జీటీలు 104 మొత్తం 112 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13 టీజీటీలు, మూడు పీఈటీలు, 15 ఎస్జీటీలతో కలిపి 31 పోస్టులు ఉన్నాయి. జోన్‌ 2 (ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా)కు సంబంధించిఏపీఆర్‌ఎస్‌,ఏపీఎంఎస్‌, ఏపీఎస్‌డబ్ల్యూ, బీసీ, సోషల్‌ వెల్ఫేర్‌కు సంబంధించి పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీఈటీ 24తో కలిపి మొత్తం 348 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:36 AM