టీడీపీ బలోపేతానికి పనిచేసే వారికే పదవులు
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:29 AM
రాజోలు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను మాత్రమే పదవుల్లో నియమించాలని టీడీపీ మండల ఎన్నికల పరిశీలకుడు తాడి నరసింహారావు అన్నారు.
రాజోలు, జూన్ 8(ఆంధ్రజ్యోతి): రాజోలు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను మాత్రమే పదవుల్లో నియమించాలని టీడీపీ మండల ఎన్నికల పరిశీలకుడు తాడి నరసింహారావు అన్నారు. స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ భవనంలో సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ సంస్థాగత ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
టీడీపీ ఇన్‌చార్జిని నియమించండి
రాజోలు నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిని తక్షణమే నియమించాలని నాయకులు, కార్యకర్తలు ఎన్నికల పరిశీలకుడు నరసింహారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈవిషయం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందని, త్వరలో నియమిస్తారని ఆయన తెలిపారు. ఎంపీపీ కేతా శ్రీను, పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు బోళ్ల వెంకటరమణ, చాగంటి స్వామి, వైస్ ఎంపీపీ పొలమూరి శ్యామ్‌బాబు, కాండ్రేగుల లావణ్య, మోకా పార్వతి, మటపర్తి లక్ష్మి, పామర్తి రమణ, అడబాల విజయ్, కడలి వెంకటరమణారావు, అనుచూరి పురుషోత్తం, కోళ్ల వెంకన్న, కట్టా సూరిబాబు, కసుకుర్తి త్రినాథస్వామి, అడబాల చంటి, గుబ్బల కుమార్, రావి మురళీ, చెల్లింగి జాంబవతి, బోళ్ల రాజేష్ పాల్గొన్నారు.