Share News

కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:41 AM

అమలాపురం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వడ్రంగుల సమస్యల పరిష్కారంలో భాగంగా వడ్రింగి కార్పొరేషన్‌ ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు. ఏపీ కార్పెంటర్‌ అసోసియేషన్‌ 8వ రాష్ట్ర

కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
వడ్రంగుల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఐక్యత ప్రదర్శిస్తున్న మంత్రి, ప్రతినిధులు

వడ్రంగి కార్పొరేషన్‌ ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

మంత్రి సుభాష్‌

అమలాపురం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వడ్రంగుల సమస్యల పరిష్కారంలో భాగంగా వడ్రింగి కార్పొరేషన్‌ ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు. ఏపీ కార్పెంటర్‌ అసోసియేషన్‌ 8వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ వడ్రంగి మేస్ర్తిలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, ఏ కార్మికుడికి కష్టం వచ్చినా తనను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వడ్రంగి మేస్ర్తిల అసోసియేషన్‌కు ఉమ్మడి జిల్లాలో భవనం ఉండేదని, కోనసీమలో కూడా భవనం మంజూరు చేయాలని వడ్రంగి అసోసియేషన్‌ చేసిన విజ్ఞప్తికి మ ంత్రి సానుకూలంగా స్పందించారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కార్పొరేషన్‌ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు నూతన అధ్యక్షుడు కమిటీ సభ్యులను ఎన్నుకుని మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తాడికొండ రంగబాబు, ప్రధాన కార్యదర్శిగా నరసింహమూర్తి, ఉపాధ్యక్షుడిగా గానాల సత్యసాయితో పాటు నూతన కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు.

Updated Date - Jul 31 , 2025 | 12:41 AM