క్రమశిక్షణతో పనిచేసే వారికి పార్టీలో పెద్దపీట
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:46 AM
క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సో మవారం కాకినాడ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
కాకినాడలో పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం
కాకినాడసిటీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సో మవారం కాకినాడ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పరిశీలకులుగా మంత్రి అచ్చె న్నాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా కృష్ణ, విశాఖ మహా రుడా చైర్మన ఎంవీ ప్రణ వ్‌గోపాల్ విచ్చేశారు. సమావేశానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన అధ్య క్షత వహించగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబా బు, వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విచ్చేసి ప్రసంగించారు. ఈ సంద ర్భంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవరం్గ అభివృది దిశగా పార్టీ తలపెట్టిన కార్యక్రమాలు, జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ నాయకులతో చర్చించారు.
జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి ఎంపిక పై ప్రతిపాదనలను మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించారు. ఆయా కమిటీల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ స్థాయి కార్యకలాపాల్లో క్రమబద్ధత, సమన్వ యం అవసరమని, కొత్తగా నియమితులయ్యే పార్లమెంట్‌కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశం ద్వారా పార్లమెంట్‌స్థాయి నాయకత్వం బలపడుతుందని, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్ట సాధ్యమైన పోరాటం ద్వారానే పార్టీ విజయాలు సాధిస్తుందని స్సష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీకోసం అహర్నిశలు శ్రమించే నాయకుల వివరాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి ఆయా కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగి స్తామన్నారు. కమిటీల నియామకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రతిపాదనలను అధ్య యనం చేసి అధిష్ఠానానికి నివేదిస్తామన్నారు. అనంతరం కమిటీల ఏర్పాటులో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీకోసం క్రమశిక్షణతో పనిచేసే నాయకులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎప్పుడూ పెద్దపీట వేస్తారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన వర్మ, మాజీ మేయర్ సుంకర పావని, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన చైర్మన కుడుపూడి సత్తిబాబు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కొల్లాబత్తుల అప్పారావు, మట్టా ప్రకాష్‌గౌడ్, నాయకులు గుణ్ణం చంద్రమౌళి, వాసిరెడ్డి ఏసుదాసు, పెంకే శ్రీనివాసబాబా, కటకం శెట్టి బాబి, గదుల సాయిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మల్లిపూడి వీరు, సుర్ల అప్పలరా జు, రాజాసూరిబాబురాజు, ఉంగరాల వెంకటే శ్వరరావు, సుంకర తిరుమలకుమార్, బోళ్ల కృష్ణమోహన, మేకా లక్ష్మణమూర్తి, గుత్తుల రమణ తదితరులు పాల్గొన్నారు. తొలుత కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవికి ప్రధానంగా జ్యోతుల నవీన, తోట నవీన పేర్లు ప్రతి పాదనకు వచ్చినట్లు తెలిసింది.