టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీవీఆర్
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:54 AM
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి (బీవీఆర్ చౌదరి) నియమితులయ్యారు.
ఇప్పటికే రుడా చైర్మన్‌గా బాధ్యతలు
రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి
రాజమహేంద్రవరం, డిసెంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి (బీవీఆర్ చౌదరి) నియమితులయ్యారు.ఈ మేరకు అధి ష్ఠానం ఆయనకు సమాచారం ఇచ్చింది. అధి కారికంగా రేపో ఎల్లుండో జాబితా విడుదల య్యే అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయి కమి టీని ప్రకటించాల్సి ఉంది. అది కూడా వెంటనే జరిగే అవకాశం ఉంది.జిల్లా కమిటీపై ఇప్పటికే కసరత్తు పూర్తయి నట్టు సమాచారం. అన్ని వర్గాలకు స్థానం కల్పించేలా ప్రయత్నం జరిగి నట్టు తెలిసింది. వాస్తవానికి మే నెలలో మహానాడు తర్వాతే ఈ కమిటీల నియామకం జరగాల్సి ఉంది. ఇప్పటిక ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతిలో సీఎం చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో జిల్లా కమిటీల నియామకంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.వాస్తవానికి కొన్ని వారాల కిందట మంత్రులు, ఇతర ముఖ్యనేతలలో త్రిసభ్య కమిటీని జిల్లాకు పంపించగా.. ఆ కమిటీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా సేకరించి ముగ్గురు పేర్లు ఫైనల్ చేసిన నివేదిక ఇచ్చిం ది. కానీ అధ్యక్షుడి విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా జిల్లా కమిటీల్లోని ఇతర నేతల పేర్లు విషయంలో ఏకాభిప్రాయం కోసం జాప్య మైనట్టు సమాచారం. అధ్యక్షుడి విష యంలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు, ఇన్ చార్జిలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అం దుకే ఆయన పేరు ఖరారైంది. బీవీఆర్ చౌదరి 2024 ఎన్నికల్లో రాజానగరం ఎమ్మెల్యే అభ్య ర్థిగా పోటీ చేద్దామనుకున్నారు. కానీ కూటమి పంపకాల నేపథ్యంలో ఆ సీటు బత్తుల బల రామకృష్ణకు కేటాయించారు. అయినా బీవీఆర్ చౌదరి కిక్కురుమనలేదు. బత్తుల గెలుపునకు పాటుపడ్డారు.దీంతో అధిష్ఠానం దృష్టిలో పడ్డా రు.ఈ మేరకు గతంలో రుడా చైర్మన్‌గా అవ కాశమివ్వగా..ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి కేటాయించడం గమనార్హం. పూర్తిస్థాయి కమి టీని ప్రకటిస్తే జిల్లాలో పార్టీ పరంగా జోష్ పెరుగుతుంది.ఇప్పటికే ఎమ్మె ల్యేలు, ఇన్ చార్జిలు, ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ జిల్లా కమిటీ నియా మకంతో జిల్లా కమిటీ కూడా ఇక పార్టీ కార్యక్రమాలలో నిమగ్నమవుతుంది.
పార్టీ పటిష్టతకు పాటుపడతా...
అందరినీ కలుపుకుని పార్టీని నడిపిస్తానని, పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేస్తా నని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.తనను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమిం చినందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు బీవీఆర్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. బీవీఆర్ ప్రస్తు తం రాజమ హేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ (రుడా ) చైర్మన్‌గానూ, రాజా నగరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
- బొడ్డు వెంకట రమణ చౌదరి
టీడీపీ నేతల ఆనందం
సీతానగరం,డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి) : రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరికి జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవి కేటాయించడంపై నియోజకవర్గంలో టీడీ పీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా సీతానగరం మండలంలోని టీడీపీ శ్రేణులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు సాయంత్రం సీతానగరం పాత బస్టాండ్ సెంటర్‌లో వలవల రాజా, కాండ్రు శేఖర్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి.. బీవీఆర్‌కు జేజేలు పలికారు. పలు ప్రాంతాల్లో మిఠాయిలు పంపిణీ చేశారు.