ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై అసత్య ప్రచారం..
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:11 AM
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 31( ఆం ధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నిరాఽధారమైనఆరోపణలు చేస్తున్న వైసీపీ నగర అధ్యక్షుడు, మాజీ ఎంపీ భరత్‌రామ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్‌సెల్ కమి
భరత్‌రామ్‌పై చర్యలు తీసుకోండి
రాజమహేంద్రవరంలో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 31( ఆం ధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై నిరాఽధారమైనఆరోపణలు చేస్తున్న వైసీపీ నగర అధ్యక్షుడు, మాజీ ఎంపీ భరత్‌రామ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్‌సెల్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఉద యం స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు టీడీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు చాపల చిన్నరాజు, లీగల్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ చేరుకుని సీఐ అప్పారావుకు ఫిర్యాదు అంది ంచారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసు వ్య క్తిగత, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా భరత్‌రామ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సో షల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని వివరించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విగ్గు పెట్టుకుని స్టైల్‌గా కళ్ల జోడు పెట్టుకుని మద్యం తాగి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ అభాండాలు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ జగన్ పెగ్గు పోశారని ఒప్పుకుంటే బాలయ్యబాబు మద్యం తాగారని తాము ఒప్పకుంటామని సమాధానమిచ్చారని, అయితే జగన్ పోసాడా అనే మాటలను కట్ చేసి తాగి వచ్చారు అనే మాటలతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకా కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా భరత్‌రామ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నగర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, బూరా రమణ, ఉడమల నాగేశ్వరరావు, చెన్నా వెంకటరమణ, కారంగీ వీర్రాజు, బత్తిన రవికుమార్, కొమరం సురేష్, దుత్తరపు గంగాధర్, కానేటి ప్రభుదాస్, బాబ్జి పాల్గొన్నారు.