Share News

పులుల గణనపై శిక్షణ

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:27 AM

చింతూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత పులుల గణనపై శిక్షణా కార్యక్ర మం గురువారం చింతూరు అటవీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. శిక్షణ ఇచ్చేం

పులుల గణనపై శిక్షణ
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న చింతూరు డీఎఫ్‌వో రవీంద్రనాధ్‌ రెడ్డి,

చింతూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత పులుల గణనపై శిక్షణా కార్యక్ర మం గురువారం చింతూరు అటవీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. శిక్షణ ఇచ్చేందుకు డెహ్రాడూన్‌ నుంచి వరల్డ్‌ వైల్డ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ రీసెర్చ్‌ బయాలిజిస్ట్‌ సాయికృష్ణ బృందం వచ్చిం ది. ఈ మేరకు జంతు జాడను కనుగొనే మెళు కవలను వివరించారు. చింతూరు డీఎఫ్‌వో రవీంద్రనాద్‌రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు క్షేత్ర స్థాయిలో 3సార్లు జంతు గణన చేపట్టాల్సి ఉంటుందన్నా రు. సబ్‌ డీఎఫ్‌వోలు రాఘవరావు, శివకుమార్‌, రేంజీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:27 AM