కళారంగాన్ని ఆదరిస్తున్న కాకినాడ ప్రజలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:43 AM
కార్పొరేషన్(కాకినాడ), సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): సినీ నటుడు కాకముందు సుమారు 45 ఏళ్ల క్రితం కాకినాడలో నాటకం రాశానని, అప్పు డు ప్రజలు నాటక, కళారంగాన్ని ఎలా ఆదరించారో నేటికి అలాగే ఆదరాభిమానాలు చూపించడం తనను మంత్రముగ్ధున్ని చేసిందని నటు డు, రచయిత, దర్శకుడు తనికె
సినీ నటుడు తనికెళ్ల భరణి
కార్పొరేషన్(కాకినాడ), సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి): సినీ నటుడు కాకముందు సుమారు 45 ఏళ్ల క్రితం కాకినాడలో నాటకం రాశానని, అప్పు డు ప్రజలు నాటక, కళారంగాన్ని ఎలా ఆదరించారో నేటికి అలాగే ఆదరాభిమానాలు చూపించడం తనను మంత్రముగ్ధున్ని చేసిందని నటు డు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నా రు. దంటు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి వం గూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, దియంగ్మెన్స్ హ్యాపీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమెరికామెడీ కథలు నాటికల ప్రదర్శనలో భాగంగా తనికెళ్ల భరణికి జీవన సాఫల్యం పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులు చప్పట్లు మాత్రమే కోరుకుంటారని, ఇక్కడ హాలు నిం డుగా ఉన్న జనాన్ని చూస్తుంటే ఎనలేని ఆనందంగా ఉంద న్నారు. సుమారు వందేళ్లకు పైబడి నాటక రంగానికి దియంగ్మెన్స్ హ్యాపీక్లబ్, దంటు కుటుంబీకులు చేస్తున్న సేవలు నిరుపమానమన్నారు. అమెరికాలో ఉంటూనే తె లుగు సాహిత్యం, భాష, కళలల పట్ల మక్కువతో వంగూరి చిట్టెన్ రాజు ఎంతో పాటుపడుతున్నారన్నారు. చిట్టెన్ రాజు మాట్లాడుతూ తనికెళ్ల భరణి నటుడిగా, సాహితీవేత్తగా తనకం టూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారని ఆయనకు పురస్కారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. బామ్మాయణం, సన్యాసీ నవ్వాడు, భార్య బాధితుల సంఘం నాటికలు ఆద్యంతం నవ్విస్తూ ఆలోచింపజేశాయి. యంగ్మెన్స్ హ్యాపీక్లబ్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, కార్యదర్శి నాదెళ్ల ప్రభుదాసు, మార్ని జానకిరామ్ చౌదరి, కృష్ణారావు, సుచిత్రమూర్తి పాల్గొన్నారు.