Share News

అమ్మయ్యా!

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:13 AM

తల్లికి వందనం పథకానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అర్జీలు వేలల్లో వచ్చాయి. గత నెల ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో తమ పేర్లు లేని నేపథ్యంలో 60,670 మంది తల్లులు కొత్తగా దరఖాస్తు చేశారు.

అమ్మయ్యా!

తల్లుల ఎదురుచూపులు

‘తల్లికి వందనం’ వినతుల వెల్లువ

ఉమ్మడి జిల్లాలో అనర్హుల అర్జీలు

60,670 మంది తల్లుల విజ్ఞప్తులు

కాకినాడలో 22,329

తూర్పుగోదావరి 21,823

కోనసీమ జిల్లాలో 16,455

అధికారుల రీవెరిఫికేషన్‌

అర్హులకు 10న డబ్బులు జమ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

తల్లికి వందనం పథకానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అర్జీలు వేలల్లో వచ్చాయి. గత నెల ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో తమ పేర్లు లేని నేపథ్యంలో 60,670 మంది తల్లులు కొత్తగా దరఖాస్తు చేశారు. అత్య ధికంగా కాకినాడ జిల్లాలో 22,329 అర్జీలు వచ్చా యి. తొలి జాబితాలో పేర్లు లేని వారికి ఈనెల 10న ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఈ మేరకు వేలల్లో పోటెత్తిన అర్జీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆధార్‌ సీడింగ్‌, హౌస్‌ మ్యా పింగ్‌, విద్యుత్‌ బిల్లుల విభాగంలో పేర్లు లేని వారి వివరాలు మరోసారి తనిఖీ చేస్తున్నారు. పునఃపరిశీలనలో అర్హత సాధించిన వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపుతున్నారు.

చాలామంది షాక్‌ తిన్నారు..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్జీల్లో ఎక్కువ శాతం విద్యుత్‌ బిల్లుకు సంబంధించినవే ఉన్నా యి. తమకు 302 యూనిట్లే విద్యుత్‌ ఖర్చయిం దని, అయినా పథకం అందలేదని అర్జీల్లో ప్రస్తా విస్తున్నారు. కొందరైతే తమ సరాసరి విద్యుత్‌ బిల్లు వినియోగం 246 యూనిట్లే అని, అయినా పథకం ఇవ్వలేదని వాపోయారు. పథకం వర్తిం చ నివారు ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ కార్యాల యాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్‌ వినియోగ బిల్లులు సైతం అర్జీలకు జత చేశారు. తమ పేరుపై అనేక విద్యుత్‌ మీటర్లు సీడింగ్‌ అయి ఉన్నాయని.. వాటన్నింటిని తొలగించాలనే అర్జీలు వచ్చాయి. అధిక విద్యుత్‌ బిల్లులకు సం బంధించిన అర్జీలను అధికారులు తిరస్కరిస్తు న్నారు. తమకు ఎప్పుడో కారు ఉండేదని, దాన్ని విక్రయించేసి మూడేళ్లు అయినా కారు పథకం తీసేశారని, తమను చేర్చాలని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులు సైతం అర్జీలు దాఖలు చేశారు. తమ ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంలో లేదని.. తిరిగి పథకంలో చేర్చాలంటూ మరికొన్ని అర్జీలు దాఖలయ్యాయి.

60,670 అర్జీలు..

ఉమ్మడి జిల్లాలో అనేక కుటుంబాలు అనర్హత జాబితాలోకి వెళ్లి పోయాయి. ఇంట్లో విద్యా ర్థులు ఉన్నా పలు కారణాలతో ఆయా తల్లు ల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. వీరందరి కోసం ప్రభుత్వం మళ్లీ కొత్తగా గడువు పొడి గించింది. అర్హత ఉండీ పథకం వర్తించకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీటిని పరిశీలించి అర్హత ఉందని తేలితే జూలై 10న తల్లుల ఖాతాల్లో మళ్లీ డబ్బులు జమ చేస్తా మని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాదిమంది తల్లు లు భారీగా అర్జీలు దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,271 సచివాలయాల పరిధిలో 60,670 అర్జీలు పోటెత్తాయి. ఇందులో ఒక్క కాకినాడ జిల్లాలోని 620 సచివాలయాల పరిధిలో 22,392 వరకు అర్జీలు వచ్చాయి. ఇందులో విద్యుత్‌ బిల్లులు, కార్లు, ఆధార్‌, హౌస్‌ మ్యాపింగ్‌ సమస్యలతో పథకానికి అర్హత సాధించకపోవడంతో మళ్లీ అర్జీలు చేసిన తల్లులు 21,421 మంది ఉన్నారు. 533 దరఖాస్తులు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందున పథకం నుంచి తొలగించారని, తమను అర్హు లుగా గుర్తించాలని 533 మంది, ఆదాయపు పన్ను ఎప్పుడో చెల్లించామనే సాకుతో పథకం రాలేదని,తిరిగివ్వాలని 438 మంది విన్నవిం చారు. తూర్పుగోదావరి జిల్లాలో 20,797 మంది వివిధ కారణాలతోను, ఐటీ సమస్యతో 572, ప్రభుత్వ ఉద్యోగాల విభాగంలో తీసేసిన తమను పథకంలో చేర్చాలంటూ 454 మం ది అర్జీలు దాఖలు చేశారు. కోనసీమ జిల్లాలో వివిధ విభాగాల కింద పథకం రానందున తిరిగి ఇవ్వాలంటూ 15,644 మంది, ఐటీ సమస్య పేరుతో 582, ప్రభుత్వ ఉద్యోగం ఉందనే కారణంతో పథకం ఇవ్వలేదని, కానీ తమ ఇంట్లో అటువంటి వారు లేరని 229 మంది దరఖాస్తు చేశారు. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మూడు విభాగాల్లో 60,670 అర్జీలు దాఖలయ్యాయి. వీటిని ఎప్పటికప్పుడు వివిధ దశల్లో అధికా రులు పరిశీలించడం ప్రారంభించారు. త్వరలో నూరు శాతం పునఃపరిశీలన జరగనుంది.

అందరికీ రెండో విడత

రాష్ట్ర ప్రభు త్వం గత నెల 13న తల్లికి వందనం పథ కాన్ని అమలుచేసింది. కాకినాడ జిల్లాలో 2,28,781 మంది విద్యార్థులకు సంబంధించి 1,49,403 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.297 కోట్లు, కోనసీమ జిల్లాలో 1,70,869 మంది విద్యార్థులకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.222 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 1,88,726 మంది విద్యార్థులకు సంబంధించి 1,23,779 మంది తల్లుల ఖాతాల్లో రూ.245 కోట్లు వెరసి ఉమ్మడి జిల్లాలో 5,88,378 మంది విద్యార్థులకు సంబంధించి 3,85,601 మంది తల్లుల ఖాతాల్లో రూ.764 కోట్లు జమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో కేవలం ఒక కుటుంబంలో ఒక విద్యార్థికే డబ్బులు జమ చేయగా సీఎం చంద్రబాబు ఆదే శాలతో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ డబ్బులు జమయ్యాయి. ఇదిలా ఉండగా రెండో విడత తల్లికి వందన ఈనెల 10వ తేదీన జమచేయనున్నారు. పునఃపరిశీలనతో అర్హత సాధించిన వారికి, ఈ కొత్త విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరిన విద్యా ర్థులకు, పది పాసై ఇంటర్‌లో చేరిన విద్యా ర్థులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల పరిధిలో 9,10 ఇంటర్‌ తరగతుల్లో చదువుతున్నవారికి ఆ రోజే నిధులు జమకానున్నాయి.

Updated Date - Jul 04 , 2025 | 01:13 AM