అమ్మలకు..ఆనందం!
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:14 AM
చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. అమ్మ ల కళ్లల్లో ఆనందం చూశారు. ‘తల్లికి వందనం’ డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ కావడం శుక్ర వారం నుంచి ఆరంభమైంది.
మాట నెరవేర్చిన ప్రభుత్వం
తల్లుల ఖాతాల్లో నగదు జమ
ఉదయం నుంచి ఫోన్లకు మెసేజ్‌లు
సచివాలయాల్లో అర్హుల జాబితా
ఎగిరి గంతేసిన అర్హులు
20 వరకు అభ్యంతరాల స్వీకరణ
28న మరో జాబితా ప్రదర్శన
30న ఒకటి, ఇంటర్ విద్యార్థులకు
(రాజమహేంద్రవరం/అమలాపురం/ కాకినాడ- ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. అమ్మ ల కళ్లల్లో ఆనందం చూశారు. ‘తల్లికి వందనం’ డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ కావడం శుక్ర వారం నుంచి ఆరంభమైంది. గురువారం జమ అవుతాయని చెప్పినా అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం రూపంలో అనుకోని విపత్తు సంభ వించడంతో ఒకరోజు ఆలస్యమైంది. చంద్రబా బు చెప్పిన విధంగానే ఎందరు పిల్లలు (విద్యా ర్థులు) అంతమందికీ ఖాతాల్లో జమ అవుతు న్నాయి. ఒకటో తరగతి, ఇంటర్మీడియెట్ మొ దటి ఏడాది అడ్మిషన్లు జరుగుతున్న కారణంగా వారికి తర్వాత ఇస్తారు. ఇప్పుడు రెండో తరగతి నుంచి పది, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సంబ ంధించి వారి తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క రికీ రూ.13 వేలు చొప్పున జమవుతున్నాయి. రూ.2 వేలను పాఠశాల నిర్వహణ నిమిత్తం మి నహాయిస్తున్నారు. ఇద్దరు పిల్లలుంటే రూ.26 వేలు.. ముగ్గురు పిల్లలుంటే రూ.39 వేలు ఖాతా ల్లో జమ చేశారు. ఆ మెసేజ్‌సెల్‌కి రావడంతోనే కుటుంబం ఎగిరి గంతేసినంత పనిచేస్తోంది.
5.80 లక్షల మంది విద్యార్థులు
ఉమ్మడి తూర్పుగోదావరిలో ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలు, కళాశాలల్లో సుమారు 5.80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి సం బంధించి ఇప్పటికే ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానం కావడంతో ఒకే సారి అంత మొత్తాన్ని ఆయా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే సాంకేతిక ఇబ్బం దులు తలెత్తుతా యి. సర్వర్లు మొరాయిస్తాయి. అందువల్ల అర్హు లైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో గంటల తేడాతో సొమ్ము జమవుతోంది. ఈ ప్రక్రియ వచ్చే నెల 5 వరకూ కొనసాగనుంది. తూర్పు గోదావరి జిల్లా లో 1,88,226 మంది విద్యార్థులకు సంబంధించి 1,23,779 మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.240 కోట్లు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,70869 మంది పిల్లలకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.250 కోట్లు, కాకినాడ జిల్లాలో 2,28,780 మంది విద్యా ర్థులకు సంబంధించి 1,49,400 మంది తల్లుల ఖాతాల్లో రూ.340 కోట్లు జమ కానున్నాయి.
సచివాలయాల వద్ద క్యూ
సచివాలయాల వద్దకు ప్రజలు పదుల సం ఖ్యలో చేరుకుని అర్హత జాబితాలను పరిశీలించుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. కొందరు అనర్హుల జాబితాలో ఉండడంతో కారణాల అన్వేషణలో పడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అత్యధికులు విద్యుత్ బిల్లుల షాక్ వల్ల అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారు. ఏడాదిని యావరేజ్ చేసి విద్యుత్ బిల్లులు నిర్థారించడంతో ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులు అర్హత సాధించకుండాపోయారు. పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామానికి చెందిన 178 మందికి విద్యుత్ బిల్లుల షాక్ కారణంగా అనర్హులుగా పరిగణించబడ్డారు. వీరంతా గన్నవరంలోనివిద్యుత్‌శాఖ కార్యాలయానికి వచ్చి ఏడాదిని యావరేజ్ చేయించుకుని విద్యుత్‌శాఖ నుంచి సర్టిఫికెట్లు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరో వైపు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలకు కొందరు చేరుకుని తమ పేరున నాలుగు చక్రాల వాహనాలు ఉండడం వల్ల అనర్హత జాబితాలో ఉన్నామని.. తమకు ఏమీ లేవని క్లియరెన్స్ సర్టిఫికెట్లు కావాలంటూ కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఒక చోట మ్యాపింగ్ పూర్తయిన తర్వాత మరో చోటకు ఇల్లు మారిన వారు అయోమయానికి గురవుతన్నారు. తాము ప్రస్తుతం నివాసం ఉం టున్న పరిధిలోని సచివాలయంలో పిల్లల పేర్లు లేకపోవడం, ఎక్కడ జాబితాలో ఉన్నాయో తెలి యకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించారన్న సమాచారం ఇప్పుడిప్పుడే గ్రామాల్లో ప్రజలకు చేరుతుంది. రెండో శనివారం సెలవు, ఆదివారం సెలవు దినాలు కావడంతో లబ్ధిదారులు మళ్లీ సోమవారం వరకు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రెండు రోజులపాటు వేచి చూడాల్సిందే. నిధులు పొందిన వారిలో ఆనందం కనిపిస్తుంటే, అనర్హుల్లో మాత్రం ఆవేదన వ్యక్తమవుతోంది.
నగదు జమకాకపోయినా కంగారుపడొద్దు!
సచివాలయాల్లో శుక్రవారం నుంచి అర్హులు, అనర్హుల జాబితా ఉంచారు. అభ్యంతరాలు, వినతులు ఈనెల 20వ తేదీలోపుగా ఆయా సచివాలయాల ద్వారా సమర్పించాలి. మరొక అర్హుల జాబితా 28వ తేదీలోపుగా రూపొందిస్తారు. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించి ఈనెల 30న జాబితాలు ప్రదర్శిస్తారు. మొత్తం తల్లికి వందనం నగదు జమ ప్రక్రియ వచ్చే నెల 5వ తేదీతో పూర్తి చేస్తారు. అర్హుల జాబితాలో ఉంటే సొమ్ము ఖచ్చి తంగా జమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనర్హత జాబి తాలో ఉన్నవారు నిరాశకు గురైనా గ్రీవెన్స్‌కి సమయం ఉందని సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రకటించినది మొదటి లిస్టు.. సమస్యల పరిష్కారం తర్వాత రెండో లిస్టు ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆధార్ తదితర సమస్యలు ఉంటే సరిచేసుకోవాలంటూ ఇప్పటికే ఆయా పాఠశాలలకు జాబితాలు వెళ్లాయి. దీంతో పాఠశాలల సిబ్బంది తల్లులకు సమాచారం ఇస్తున్నారు. ప్రతి తల్లి లేదా సం రక్షకుడు ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకున్న బ్యాంకు ఖాతాకే డబ్బు లు జమవుతాయి. సింగిల్ పేరెంట్ తండ్రి ఉంటే అతని ఖాతాకు డబ్బులు వెళతాయి.అనాథ పిల్లల నగదును కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసి పరిశీలన అనంతరం అందజేస్తారు. ఇప్పటికే అర్హులకు సంబంధించిన నగదును బ్యాంకులకు ప్రభుత్వం పంపించింది.
నలుగురికి రూ.52 వేలు..
సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. మాది పెరవలి మండలం కానూరు అగ్రహారం.. మాకు నలుగురు పిల్లలు.. రూ.52 వేలు మా అకౌంట్‌లో పడ్డాయి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం మా అకౌంట్‌లో పడడం తొలిసారి. చాలా ఆనందంగా ఉంది. గతంలో కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చేవి.
- ఎం.శివయ్య, ధనలక్ష్మి, కానూరు, పెరవలి
ఆధార్ లింకైతే నలుగురికి...
మాకు నలుగురు పిల్లలు. సాకుర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. గతంలో అమలాపురంంలో ఉండేవాళ్లం. రేషన్‌కార్డు అక్కడే ఉంది.బ్యాంకుఖాతాకు ఆధార్ అనుసంధానం కాలేదు.దీంతో నిలిచిపోయింది. అనుసంధానమైతే తల్లికి వందనం వస్తుందని విద్యాశాఖాధికారులు తెలిపారు.
- జి.శ్రీనివాసరావు,శాంతికుమారి, సాకుర్రు
అమ్మ లేకున్నా.. నానమ్మకు..
తల్లి లేని ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు జమైంది. ఆనందంగా ఉంది. మా అబ్బాయి దిమ్మిలి దేవదాసు వ్యవసాయ కూలీ. కొంత కాలం కిందట అతని భార్య చనిపోయింది. దీంతో ముగ్గురు పిల్లల సంరక్షణ నేనే చూస్తున్నా.ఇచ్చిన మాటకు కట్టుబడి సొమ్ములు వేసి న కూటమి ప్రభుత్వానికి ఇదే మా వందనం.
- నాయనమ్మ సుబ్బలక్ష్మి, చిన్నారులు
మా పిల్లల చదువుకు వినియోగిస్తాం..
నా ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు జమయ్యాయి. ఆనందంగా ఉంది. మాది బిక్కవోలు మండలం రంగాపురం..శుక్రవారం ఉదయం మెసేజ్ వచ్చింది.. ఏమిటా అని చూస్తే రూ.39 వేలు జమయ్యాయి. సొమ్ము బ్యాంకులోనే ఉంచి మా పిల్లల చదువుకు వినియోగిస్తాం.
- తనుబోయిన అనూష, వెంకటరమణ, బిక్కవోలు
ముగ్గురికి రూ.39 వేలు పడ్డాయి..
చంద్రబాబు చెబితే చేస్తారని తెలు సు.. బాబును నమ్మాం.. బాగుపడు తున్నాం.. మాది కడియం మండలం దుళ్ళ.. నా పేరు తొట్టా స్వాతి. నా భర్త సత్తిబాబు ఆటో డ్రైవరు.. మాకు ముగ్గురు అమ్మాయిలు...నా ఖాతాలో రూ.39 వేలు జమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది.
- తొట్టా స్వాతి, సత్తిబాబు, దుళ్ళ, కడియం మండలం
అన్నమాట నిలబెట్టుకున్నారు...
పాఠశాలల ప్రారంభం మరుసటి రో జునే తల్లికి వందనం వేయడం ఆనం దంగా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని, అన్నమాట నిలబెట్టుకున్నారు. మా ముగ్గురు కుమార్తెలకు రూ.39 వేలు పడ్డాయి. - ఎస్.శ్రీనివాసరావు, త్రిలోకసుందరి, గంగలకుర్రు (పెదపాలెం)
చంద్రన్నకు వందనం
మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి.. శుక్రవారం ముగ్గురికి అమ్మకు వందనం సొమ్ము జమైంది. దీంతో మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. ఽగత ప్రభుత్వంలో మణికంఠకు మాత్రమే ఇచ్చారు.
- ఉప్పు నాగరాజు,నాగమహాలక్ష్మి, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం
రూ.39 వేలు..చదువులకే ఖర్చు చేస్తాం..
మాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు బంగారు తల్లులే. శుక్రవారం రూ.39 వేలు పడ్డా యి. ఎంతో ఆనందం కలిగింది. గతంలో ఒకరికే పడేది.. ఇప్పుడు ముగురికి డబ్బులు పడ్డాయి. వారి చదువుకే ఖర్చు చేస్తా.
- త్రినాథుల శివశంకర్, మల్లిక దంపతులు, దుర్గాడ
ఇది మంచి ప్రభుత్వం
ఇది మంచి ప్రభుత్వం.. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మాది కొవ్వూరు మండలం పెనకనమెట్ట..మాకు ముగ్గురు పిల్లలు. తల్లికి వందనం పథకంలో భాగంగా శుక్రవారం రూ. 39 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఆనందంగా ఉంది.
- ఇంటి శ్రీను, శ్రావణి, పెనకనమెట్ట, కొవ్వూరు మండలం