Share News

కాకినాడలో టైక్వాండో చాంపియన్‌షిప్‌

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:34 PM

కాకినాడ సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంరఽధప్రదేశ్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 39వ సబ్‌ జూనియర్‌, 8వ కాండేట్‌, 41వ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు కాకినాడ సూర్యకళామందిరంలో ఆదివారం ఘనం గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 250మంది

కాకినాడలో టైక్వాండో చాంపియన్‌షిప్‌
క్రీడాకారులతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు

కాకినాడ సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంరఽధప్రదేశ్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 39వ సబ్‌ జూనియర్‌, 8వ కాండేట్‌, 41వ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు కాకినాడ సూర్యకళామందిరంలో ఆదివారం ఘనం గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 250మంది క్రీడాకా రులు హాజరయ్యారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షిం చారు. విద్య, ఉద్యోగాల్లో క్రీడా రిజర్వేషన్‌ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్‌సలామ్‌, డీఎస్‌డీవో సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడలతో రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు రాయుడు శ్రీను, రాష్ట్ర కోశాఽధికారి ఎం.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:34 PM