తాడువాయి... మరో మాట లేదోయి!
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:59 PM
కూనవరం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతానికి గిరిజనేతరుల పోలవరం నిర్వాసితులకు మరో ప్రత్యామ్నాయం లేదు. మీకు ఏలూరు జిల్లా తాడువాయిలోనే పునరావాసం.. ఒకవేళ కొంతమందికి అక్కడికి వెళ్లడం ఇష్టం లేకపోతే వారి గురించి తర్వాత ఆలోచిస్తాం.. అంటూ సాక్షాత్తూ చింతూరు ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ ప్రత్యేకాధికారి శుభం నోక్వాల్ ఇటీవల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పడంతో నిర్వాసితులకు గుబులు రేగింది. అల్లూరి జిల్లా కూనవరం మండలంలో 9 ప్రాధాన్య గ్రామాలను గుర్తించి ప్రభుత్వం పోలవరం పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఆ
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కేంద్రం అక్కడే..
వెళ్లడం ఇష్టంలేనివారి
గురించి తర్వాత ఆలోచిస్తాం
ఐటీడీఏ పీవో మాటలు.. నిర్వాసితుల్లో రేగిన గుబులు
కూనవరం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతానికి గిరిజనేతరుల పోలవరం నిర్వాసితులకు మరో ప్రత్యామ్నాయం లేదు. మీకు ఏలూరు జిల్లా తాడువాయిలోనే పునరావాసం.. ఒకవేళ కొంతమందికి అక్కడికి వెళ్లడం ఇష్టం లేకపోతే వారి గురించి తర్వాత ఆలోచిస్తాం.. అంటూ సాక్షాత్తూ చింతూరు ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ ప్రత్యేకాధికారి శుభం నోక్వాల్ ఇటీవల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పడంతో నిర్వాసితులకు గుబులు రేగింది. అల్లూరి జిల్లా కూనవరం మండలంలో 9 ప్రాధాన్య గ్రామాలను గుర్తించి ప్రభుత్వం పోలవరం పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఆ గ్రామాలకు ఇళ్లకు సంబంధించిన పరిహారం బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అయితే 7 గ్రామాలకు పునరావాస ప్రక్రి య సజావుగా సాగుతున్నా కూనవరం, టేకులబోరు గ్రామాల్లో అధికారుల తప్పిదం కారణంగా చిక్కుముడి ఏర్పడింది. ఈ గ్రామాల ప్రజలకు మొదటిగా తాడువాయి పునరావాస కేంద్రమంటూ కొంతమందిని బస్సుల్లో తీసుకెళ్లి చూపించారు. కొంతమంది అంగీకారం తెలపగా మరికొంతమంది వ్యతిరేకించారు. కొంతకాలం తర్వాత వ్యతిరేకించిన వారికి కోయిలగూడెం గ్రామాన్ని చూపించారు. దీంతో మిగతావారు ఆ గ్రా మానికి అంగీకారమంటూ అధికారులకు చెప్పారు. ఇప్పుడు కోయిలగూడెం గ్రామం పునరావాస కేంద్ర జాబితాలోలేదని కేవలం తాడువాయి మాత్రమే పునరావాస కేంద్రమని మండలంలో ప్రతీ ఒక్కరూ తాడువాయి గ్రామాన్నే ఎంచుకోవాలని అధికారులు చెప్పడంతో నిర్వాసితులు కంగుతిన్నారు. తమను బస్సుల్లో తీసుకెళ్లి కోయిలగూడెం గ్రామాన్ని ఎందుకు చూపించారని అక్కడ పునరావాసం కల్పిస్తామంటూ అధికారులు చెప్పిన మాట వాస్తవం కాదా అప్పుడు జాబితాలో ఉన్న గ్రామం ఇప్పుడు ఎందుకు లేదని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. అయితే పొరపాటు జరిగిందని, కోయిలగూడెంలో పునరావాసం కల్పించలేమని సాక్షాత్తు ఐటీడీఏ పీవో ఇటీవల జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారు. అయితే ఇక్కడ నిర్వాసితులకు తాడువాయిలోనే పునరావాసం కల్పిస్తామని మరెక్కడా ప్రస్తుతానికి పునరావాసం లేదని పీవో చెప్పారు. ప్రత్యామ్నాయం వెతుక్కునే వారి గురి ంచి తర్వాత ఆలోచిస్తామన్నారు. దీంతో కొంతమంది గత్యంతరం లేక తాడువాయినే పునరావాస కేంద్రంగా ఎంచుకుంటున్నారు.
పీవో సీసీతో సమావేశం ఏంటి?
తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం జరి గిన నిర్వాసితుల సమావేశానికి ఐటీడీఏ పీవో రాకుండా ఆయన సీసీ సమావేశం నిర్వహించడంతో నిర్వాసితుల నుంచి విమర్శలు వస్తున్నా యి. జీవనమరణ సమస్యలు వంటి పరిహారం విషయంలో జవాబుతనం లేని అధికారులను ప ంపించడం ఏంటని నిర్వాసితులు అంటున్నారు. ఐటీడీఏ పీవో కానీ, సంబంధిత అధికారులు కానీ వచ్చి నిర్వాసితుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా పునరావాసంపై మరోసారి ఐటీడీఏ పీవో కూనవరంలో గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సభలోనైనా నిర్వాసితులకు స్పష్టమైన హామీ రావాలని వారు కోరుతున్నారు.