Share News

స్వచ్ఛ పంచాయతీ రాష్ట్రస్థాయి అవార్డుకు ‘లొల్ల’ ఎంపిక

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:38 AM

ఆత్రేయపురం, అక్టోబరు 3(ఆంధ్ర జ్యోతి): పారిశుధ్య నిర్మూలనలో లొల్ల గ్రామం ఆదర్శనీయంగా నిలిచి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డుకు ఎంపికైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల పంచాయతీ స్వచ్ఛ అవార్డుకు ఎంపిక కోసం ఈనెల 6న చంద్రబాబు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్‌ కా

స్వచ్ఛ పంచాయతీ రాష్ట్రస్థాయి అవార్డుకు ‘లొల్ల’ ఎంపిక
లొల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం

ఆత్రేయపురం, అక్టోబరు 3(ఆంధ్ర జ్యోతి): పారిశుధ్య నిర్మూలనలో లొల్ల గ్రామం ఆదర్శనీయంగా నిలిచి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డుకు ఎంపికైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల పంచాయతీ స్వచ్ఛ అవార్డుకు ఎంపిక కోసం ఈనెల 6న చంద్రబాబు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్‌ కాయల జగన్నాఽథం స్వచ్ఛ భారత్‌ అవార్డును అందుకోనున్నారు. లొల్ల పంచాయతీలో ముగ్గురు గ్రీన్‌ అంబాసిడర్లతో ఇంటిం టికి వెళ్లి తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించడంతో పాటు వర్మికంపోస్టు తయారు చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించి స్వచ్ఛ రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో సర్పంచ్‌ జగన్నాథం, కార్యదర్శి కృష్ణామాచార్యులు ఎంతగానో కృషిచేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా లొల్ల గ్రామంలో 90 శాతం అపారిశుధ్యం నిర్మూలించడంలో తీవ్ర కృషిచేశారు. ఈ నేపథ్యంలో లొల్ల పంచాయతీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది.

అందరి సహకారంతోనే సాధ్యం...

ప్రజలందరి సహకారంతోనే తమ గ్రామం రాష్ట్ర స్థాయిలోనే ఆదర్శనీయంగా నిలవడం హర్షనీయం. గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తడిచెత్త, పొడిచెత్తను సేకరించడంలో ప్రజలు ఎంతగానో సహకరిచడం ద్వారానే ఇది సాధ్యమైంది. సచివాలయ ఉద్యో గులు, పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సమష్టి కృషితో తమ గ్రామం ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందదాయకం.

సర్పంచ్‌, కాయల జగన్నాఽథం

Updated Date - Oct 04 , 2025 | 01:38 AM