Share News

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ వైపు పయనిద్దాం : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:18 AM

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌21(ఆంధ్రజ్యోతి): పచ్చదనాన్ని పెంపొందించి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ వైపు పయనిద్దామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల సమీపంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వ

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ వైపు పయనిద్దాం : కలెక్టర్‌
మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌21(ఆంధ్రజ్యోతి): పచ్చదనాన్ని పెంపొందించి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ వైపు పయనిద్దామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల సమీపంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వారు ముఖ్యఅతిఽథులుగా పాల్గొని మొక్కలు నాటారు. అనంత రం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాను కాలుష్య రహి త జిల్లాగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణ క్రమంలో ఈ-వ్యర్థాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే లెడ్‌ వంటి రసాయనాలు ప్రజలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నా రు. ప్రజల్లో ఈ-వ్యర్థాలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టిందని, తద్వారా ఈ- వ్య ర్థాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించేందుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మా ట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడాన్ని ప్రతీ పౌరుడు తన సామాజిక భాధ్యతగా భావించాలన్నారు. మానవళి మను గడ పచ్చదనం పరిఢవిల్లితేనే సాధ్యమౌతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, నగరపాకల సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, సెక్రటరీ జీ శైలజవల్లి, ఎస్‌ఈ ఎంసీహెచ్‌ కోటేశ్వరరావు, సీఎంఎం రామలక్ష్మి, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 01:18 AM