Share News

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు స్టేట్‌ మినిస్టీరియల్‌ అవార్డు

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:09 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు స్టేట్‌ లెవెల్‌ మినిస్టీరియల్‌ అవార్డు లభించిం ది.

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు స్టేట్‌ మినిస్టీరియల్‌ అవార్డు

రాజమహేంద్రవరం సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు స్టేట్‌ లెవెల్‌ మినిస్టీరియల్‌ అవార్డు లభించిం ది. గతంలో దేశంలో మంచి ర్యాంక్‌లు సాధించిన నగరాలను పరిశీలించి వాటికి జాతీయ స్థాయిలో సూపర్‌ లీగ్‌ సీటీస్‌గా, స్పెషల్‌ స్పెషల్‌ కేటగిరి,మినిస్టీరియల్‌ అవార్డులకు ఎంపిక చేసి కేంద్రప్రభుత్వం శనివారం ప్రకటించింది. నగరపాలక సంస్థకు కమిషనర్‌గా పనిచేసి ఇటీవల బదిలీ అయిన కేతన్‌గార్గ్‌, ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్‌ ఇంద్రగంటి శ్రీనివాస్‌, శానిటరి ఇన్‌స్పెక్టర్లు, మేస్ర్తీలు, కార్మికులు నగర శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరిశుభ్రత, మెరుగైన పారిశుధ్యం, శాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మినిస్టీరియల్‌ అవార్డును రాష్ట్రస్థాయిలో ఎంపిక చేశారు. ఈ మేరకు అవార్డు వరించింది.ఈ అవార్డును ఈనెల 17న దేశరాజధాని ఢిల్లీ విజ్ఞా న్‌ భవన్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఇన్‌చార్జి కమిషనర్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి అందుకుంటారు. అవార్డుతో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కీర్తి ఇనుమడించబోతుంది.

అవార్డు బాధ్యత పెంచింది

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు స్వచ్ఛసర్వేక్షణ్‌లో స్టేట్‌ లెవెల్‌ మినిస్టీరియల్‌ అవార్డు రావడం నగరాభివృద్ధిలో కీలక మైలురాయి. నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి ,ప్రజాసేవా కార్యక్రమాలకు ఇది లభించిన గౌరవప్రద గుర్తింపు. ఆ గుర్తింపును నిలబెట్టుకుంటాం. పారిశుధ్యంపై మరింత దృష్టి సారిస్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు రావడం ఆనందంగా ఉంది. - ప్రశాంతి, కలెక్టర్‌, ఇన్‌చార్జి కమిషనర్‌

Updated Date - Jul 13 , 2025 | 01:09 AM