Share News

స్వచ్ఛ..పండుగ

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:17 AM

స్వచ్ఛాంధ్ర 2025 అవార్డుల ప్రధానోత్సవం రాజమహేంద్రవరంలో పండుగలా జరిగింది.

స్వచ్ఛ..పండుగ
51 జిల్లా అవార్డులు అందజేసిన కలెక్టర్‌ కీర్తి చేకూరి చిత్రంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము తదితరులు

3 రాష్ట్ర అవార్డులు అందించిన సీఎం

51 జిల్లా అవార్డులిచ్చిన కలెక్టర్‌

ప్రతి పల్లె స్వచ్ఛంగా ఉండాలి

మార్పు మన నుంచే రావాలి

కలెక్టర్‌ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 6 (ఆం ధ్రజ్యోతి) : స్వచ్ఛాంధ్ర 2025 అవార్డుల ప్రధానోత్సవం రాజమహేంద్రవరంలో పండుగలా జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సోమవారం రాత్రి జిల్లా సాసా నోడల్‌ అధికారి ,జేసీ వై.మేఘస్వరూప్‌ సమన్వయకర్తగా స్వచ్ఛా ంధ్ర 2025 అవార్డుల ప్రధానోత్సవం చేశారు. తొలుత కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వచ్ఛత అనేది దేశానికో, రాష్ట్రానికో చేసే సేవ గా భావించకుండా మనకు మనం చేసుకునే సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని అప్పుడే మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. మార్పు అనేది మన ఇంటి నుంచి.. మన పిల్లల నుంచే ఆరంభం కావాలన్నారు. జిల్లాకు స్వచ్ఛత అవార్డులు రావడం వెనుక పారిశుధ్య కార్మికుల కృషి ఎంతో ఉందని అభినందించారు. జిల్లాకు 3 రాష్ట్ర, 51 జిల్లా స్థాయి అవార్డులు రావడం ఆనందకరమన్నా రు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2017లో ప్రారంభమై పెనుమార్పులు తెచ్చిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అధికారులు, పారిశుధ్య కార్మికుల కృషి ఫలితంగా అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చాలని ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడు తూ స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అవార్డుల ప్రధానం చేశారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రతి పల్లె స్వచ్ఛంగా తయారుచేయాలన్నారు.

3 రాష్ట్రస్థాయి అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీ కింద రెండు రాష్ట్రస్థాయి అవా ర్డులను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ.రామలింగేశ్వరరావు అందుకున్నారు. స్వచ్ఛ బస్‌స్టేషన్‌గా కొవ్వూరు ఎంపికైంది. అవార్డును నాటి డీఎం వైవీవీఎన్‌ కుమార్‌కు సీఎం చంద్రబాబు అందజేశారు.

51 జిల్లాస్థాయి అవార్డులు..

స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల అవార్డును ఆర్‌డీవో కృష్ణనాయక్‌, ధవళేశ్వరం ఇరిగేషన్‌ కా ర్యాలయ అవార్డు శ్రీనివాసరావు అందుకున్నారు.

ఉత్తమ స్వచ్ఛత గ్రీన్‌ అంబాసిడర్‌ :కె.వీరపాండు(వెం కటనగరం),బొంగరాల దుర్గాప్రసాద్‌ (వేలివెన్ను),పి.రామారావు(నందమూరు), యు. నాగరాజు(ఘంటావారిగూడెం), బత్తిన రాజు (కుతుకులూరు) అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ స్వచ్ఛత ఎన్జీవోలు : గుబ్బల రాంబాబు (స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌,రాజమండ్రి), పీవైఎన్‌వీ.సతీష్‌ , మల్లిడి శ్రీనివాసరెడ్డి (శ్రీరామకృష్ణ సేవా సమితి, అనపర్తి), బీకె హేమ(ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయవిశ్వవిద్యాల యం , రాజమండ్రి)లకు ప్రధానం చేశారు.

ఉత్తమ స్వచ్ఛత యోధులు : ఇంటి పార్వతి, రేలంగి సత్యనాగేశ్వరావు, ముత్యాల పాండురంగ,యార్లగడ్డ సుబ్బయ్యమ్మ (రాజమండ్రి కా ర్పొరేషన్‌), బంగారు సూరిబాబు ,బొట్టు శ్రీహరి, కృష్ణవేణి మామిడిపల్లి, వడ్డాది దుర్గారావు (నిడదవోలు), మీసాల శ్యాంబాబు ,వడ్డాది సత్తిబాబు (కొవ్వూరు)లకు ప్రధానం చేశారు.

స్వచ్ఛ అంగన్‌వాడీలు : సోమన అరుణదేవి (రాజమండ్రి చౌడేశ్వర్‌నగర్‌),కోరుకొండ అంగన్‌వాడీ అజూబా (కొడమంచిలి),ముక్కామల అం గన్‌వాడీ (పెరవలి) వి.నయనమ్మ, కొవ్వూరు రాజీవ్‌ కాలనీ అంగన్‌వాడీ చల్లా కనకదుర్గాదేవి, నిడదవోలు తాడిమళ్ళ అంగన్‌వాడీ ఎల్లా మో హినీదేవిలకు అవార్డులను ప్రధానం చేశారు.

స్వచ్ఛ పంచాయతీలు : మహబూబ్‌ ఆలీ( చాగల్లు), బానోతు వెంకటేశ్వర్లు(ఘంటావారి గూడెం), డి.ముత్యం(ఐ.పంగిడి), వడ్డి వీరేంద్ర( కాతేరు), ఎస్‌ఎస్‌.ఫణికుమార్‌(కుతుకులూరు) అవార్డులను అందుకున్నారు.

స్వచ్ఛ ఆసుపత్రులు : పీహెచ్‌సీడాక్టర్‌ కె చంద్రబాబు(చాగల్లు), డాక్టర్‌ ఏహరి శ్రీనివాస్‌ (ఖండవల్లి), డాక్టర్‌ దిలీప్‌ కృష్ణ చైతన్య(రాజమండ్రి మెరకవీధి)లకు అవార్డులు ఇచ్చారు.

స్వచ్ఛ హాస్టల్స్‌ : ఎస్సీ బాలికల వసతి గృహం కె.నాగభూషణం(సమిశ్రగూడెం), గణేష్‌ చౌక్‌ బీసీ హాస్టల్‌ వాసంశెట్టి సత్యవాణి(రాజమండ్రి), జీఎహెచ్‌ఎస్‌ ఎంఐ ప్రియదర్శిని (బొమ్మూరు) అవార్డులు అందుకున్నారు.

స్వచ్ఛ పరిశ్రమలు : బలభద్రపురం గ్రాసిం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఎం.జగదీష్‌ గుప్తా, గుమ్మళ్లదొడ్డి అస్సాగో ఇండస్ట్రీస్‌ కె.విశ్వనాథ్‌ నాయుడు, రాజమండ్రి రూరల్‌ తేజాస్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌ సేథి రమేష్‌ కుమార్‌,ధవళేశ్వరం హౌస్‌ ఆఫ్‌ ట్రైబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కిషోర్‌లకు అవార్డులిచ్చారు.

స్వచ్ఛ పురపాలక సంఘాలు : నిడదవోలు ఏఎం సత్యనారాయణ, స్వచ్ఛ నివాస వసతి గృహాలు అవార్డులను ఏపీఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ ధవళేశ్వరం ఏ.వాణి కుమారి అందుకున్నారు. స్వచ్ఛ రైతు బజార్‌ అవార్డును రాజమండ్రి క్వారీ రైతుబజార్‌ ఎస్‌.రోజియా అందుకున్నారు.

స్వచ్ఛ పాఠశాలలు : రఘుదేవపురం పీఎంశ్రీజడ్పీ స్కూల్‌ శ్యామలదేవి, నిడదవోలు జెడ్‌పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాల నిట్టల అరుణరాజేశ్వరి ఫిలిప్‌, అనపర్తి ఎస్‌ఆర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ప్లస్‌ పి.వెంకటరెడ్డి, రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీ ఎన్‌.ప్రశాంతి, కుమారదేవం ఎం పీపీ స్కూల్‌ పి.చాముండేశ్వరి అందుకున్నారు.

స్వచ్ఛ డ్వాక్రా సంఘాలు : రాజమహేంద్రవరం సీతంపేట మహిళా సహకార సంఘం, కొవ్వూరు రాజీవ్‌కాలనీ మహిళా సంఘం, శ్రీనివాసపురం మహిళా సంఘం అవార్డులను పీడీ టి.కనకరాజుకు అందించారు.

స్వచ్ఛ గ్రామాలు : బి.అబ్బులు (చండ్రేడు), బండారు రామకృష్ణ(కానూరు), పెనుమాక రోజ్‌ మాణిక్యం (కరిచర్లగూడెం), గుమ్మడి సునీత( వెలుగుబంద), కంఠం విజయనిర్మల(వేములూరు) అవార్డులు అందుకున్నారు.

Updated Date - Oct 07 , 2025 | 01:17 AM