స్వచ్ఛం..సత్యం!
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:13 AM
ఇటీవల ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి, 51 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి.
3 రాష్ట్రస్థాయి..51 జిల్లాకు ఎంపిక
కష్టపడ్డారు..ఫలితం సాధించారు
నేడు అవార్డులు అందజేత
ఇప్పటికే ఆహ్వానాలు చేరిక
ఇటీవల ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి, 51 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను సోమ వారం అందజేయనున్నారు.రాష్ట్ర స్థాయి అవా ర్డులు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాజమహేంద్రవరం కార్పొరేషన్ అడిష నల్ కమిషనర్ పీవీ.రామలింగేశ్వర్, కొవ్వూరు ఆర్టీసీ డీఎం వైవీవీఎన్.కుమార్ అందుకోనున్నా రు.జిల్లా స్థాయి అవార్డులను ఆనం కళాకేంద్రం లో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా ఆయా అవార్డు గ్రహీ తలు అందుకోనున్నారు. జిల్లాలోని ప్రజాప్రతి నిధులకు, అవార్డు గ్రహీతలకు జిల్లాస్థాయి అధికారులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
కొవ్వూరు బస్టాండ్..అద్వితీయం!
కొవ్వూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ స్వచ్ఛత అవార్డుల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానానికి ఎంపికైంది. గతంలో కొవ్వూరుకు డిపో మేనేజర్‌గా పనిచేసిన వై.వి.వి.ఎన్.కుమార్ ఆధ్వర్యంలో డిపో, బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోను, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం, పరిసరాలలో మొక్కలు నాటి సంరక్షించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛత అవార్డుకు ఎంపిక చేశారు. దీనిపై ప్రసుత్త రావులపాలెం డిపో మేనేజర్ వై.వీ.వీ.ఎన్.కుమార్ మాట్లాడుతూ డిపోలోని అందరి ఉద్యోగులు, కార్మికుల సహకారంతో అవార్డును సాధించామని, అవార్డు కు ఎంపికవడం ఆనందాన్ని కలిగించిందన్నారు.
చిరు ఆలోచనతో.. చెత్తశుద్ధి!
కొవ్వూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఒక చిన్న ఆలోచన పెద్ద సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు ఆ గ్రామ పంచాయితీకి అవార్డును తెచ్చి పెట్టింది. ప్రతి పంచాయతీలో రహదారుల పక్కన చెత్తను గుట్టలు, గుట్టలుగా పారబోస్తా రు. కొవ్వూరు మండలం పంగిడి గ్రా మంలో పంచాయతీ సిబ్బంది ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్టు తయారుచేస్తున్నారు. కంపోస్టు ఎరువును రైతులకు, ఏజన్సీలకు కేజీ రూ.10 నుంచి రూ.12 లకు విక్రయించి ఆదాయం ఆర్జిస్తున్నా రు. ప్రతినెలా 1.5 టన్నుల నుంచి 2 ట న్నుల కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు.దీంతో చ్తెత సమస్యకు కొంత పరిష్కారం చూపడంతో పాటు ఆదా యాన్ని అర్జిస్తున్నారు. ప్రతీ పంచాయతీ పంగిడి పంచాయతీని ఆదర్శంగా తీసుకుని చెత్త నుంచి సంపద తయారీ చేయ డం ప్రారంభిస్తే చెత్త సమస్యకు చెక్ పడుతుంది. ఈ మేరకు పంగిడిని స్వచ్ఛ పంచాయతీ అవార్డుకు ప్రభుత్వం ఎం పిక చేసింది. అవార్డుకు ఎంపికవడం ఆనందంగా ఉందని కార్యదర్శి డి.ము త్యం, సర్పంచ్ గోశాల నాగార్జున, ఉపసర్సంచ్ ఉప్పులూరి ఫణి వెంకట కృష్ణారావు (నానాజీ)లు తెలిపారు.
చెత్తను అమ్మేస్తున్నారు..
అనపర్తి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : అనపర్తి మండలం కుతుకులూరు ఉత్తమ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. పారిశుధ్య నిర్వహణలో సిబ్బంది చూపిస్తున్న అంకిత భావం అవార్డు సాధనకు దోహదపడింది. అంచెలంచెలుగా పంచాయతీలో తడి చెత్త పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుం డా ఇలా విడదీసిన చెత్త ద్వారా ఎరువును త యారు చేసి విక్రయిస్తూ ఆదాయం చేకూరుస్తు న్నారు. కార్యదర్శి ఫణికుమార్ మాట్లాడు తూ అవార్డు సాధించడం ఆనందంగా ఉంద న్నారు.
ఉత్తమ పాఠశాల..
అనపర్తి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛాంధ్ర- స్వరాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ స్వచ్ఛ పాఠశాల అవార్డుకు అనపర్తిలోని శ్రీరామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎంపికైంది. పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా స్వచ్ఛతపై నిర్వహించిన అనేక పోటీలలో పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచ డమే కాకుండా స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అవార్డుతో స్వచ్ఛతపై మరింత భాద్యత పెరిగిందని ప్రదానోపాధ్యాయుడు పులగం వెంకటరెడ్డి అన్నారు.
వెంకటనగరం పంచాయతీకి రెండు అవార్డులు
రాజమహేంద్రవరం రూరల్, అక్టోబరు 5 ( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం రూరల్ మం డలం వెంకటనగరం గ్రామానికి వివిధ కేటగిరీల కింద రెండు అవార్టులు ద క్కాయి.ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్‌గా కార్యదర్శి కె.వీరపండు, స్వచ్ఛ గ్రామ పం చాయతీ కేటగిరీలో వెంకట నగరం పూర్వ కార్యదర్శి సిహెచ్.రాణి ఎంపికయ్యారు. సోమవారం అవార్డు అందుకోనున్నారు.
ఆర్‌డీవో ఆఫీస్..సూపర్
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 5( ఆం ధ్రజ్యోతి): జిల్లాలో పరిశుభ్రమైన కార్యాలయంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం అవార్డు సాధించింది. ఆర్‌డీవోగా ఆర్.కృష్ణనాయక్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తీర్చిదిద్దారు. కార్యాలయ సిబ్బంది తాగునీటికి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వినియోగించవద్దని సూచిం చి స్వయంగా స్టీల్ వాటర్ బాటిళ్లు,జ్యూట్ బ్యాగ్‌లు అందజేశారు.డస్ట్ బిన్నులను ఏర్పాటు చేయించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తున్నారు.సబ్‌కలెక్టర్ కార్యాలయానికి అవార్డు రావడం పట్ల ఆర్‌డీవో కృష్ణనాయక్ ఆనందం వ్యక్తం చేశారు.