Share News

స్లో..లార్‌!

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:53 AM

జిల్లాలో పలు ఇళ్లు సూర్యఘర్లుగా మారా యి. ఇంటి మీద సూర్యుడు..ఇంటి నిండా కాంతి అన్న చందంగా సోలార్‌ విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి.

స్లో..లార్‌!

అంతంతమాత్రంగా స్పందన

జిల్లాలో 14,624 దరఖాస్తులు

3997 మందికే కనెక్షన్లు

బీసీలకు మరో 20 శాతం రాయితీ

ఎస్సీలకు ఉచితంగా

సబ్సిడీలు ఇచ్చినా వెనకడుగు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పలు ఇళ్లు సూర్యఘర్లుగా మారా యి. ఇంటి మీద సూర్యుడు..ఇంటి నిండా కాంతి అన్న చందంగా సోలార్‌ విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించడం.. సాధారణ విద్యుత్‌ వాడకాన్ని తగ్గించి..కొంత డబ్బు కూడా ఆదా చేయవచ్చేనే యోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్‌ పఽథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలి సిందే. జిల్లాలో ఇప్పటి వరకూ 14,624 మంది దరఖాస్తు చేసుకున్నారు.అందులో 3999 మంది సోలార్‌ విద్యుత్‌ వినియోగిస్తున్నారు. మిగిలిన వారు ఫీజు చెల్లించి.. త్వరగా ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుంటే లబ్ధి చేకూరుతుంది. నిడదవోలు విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో 9893 మంది దర ఖాస్తు చేయగా కేవలం 1794 మంది సోలార్‌ విద్యుత్‌ వినియోగిస్తున్నారు ఈ డివిజన్‌లోనే ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం 5634.98 కిలోవాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. రాజమహేంద్రవరం రూరల్‌ డివిజన్‌ పరిధిలో 2463 దరఖాస్తు చేయగా 1012 మంది 3179 కిలోవాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రాజమ హేంద్రవరం అర్బన్‌ డివిజన్‌ పరిధిలో 2268 మంది దరఖాస్తు చేయగా 1191 మంది 4176 కిలో వాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

అవసరం.. ఆదాయం

జిల్లాలో ఇప్పటికే 3997 ఇళ్ల నుంచి మొత్తం ప్రతి రోజూ 12989.98 కిలోవాట్స్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఒక కిలో వాట్‌ నుంచి 4 యూనిట్లు విద్యుత్‌ వస్తుంది. అంటే రోజుకు 51,959.92 యూనిట్ల సోలార్‌ విద్యుదు త్పత్తి అవుతోంది. దీంతో ఆయా ఇళ్ల యజమా నులంతా లబ్ధి పొందుతున్నారు.ఒక కిలో వాట్‌ సోలార్‌ ప్యానెల్‌ పెట్టుకుంటే నెలకు 120 యూనిట్లు విద్యుదుత్పత్తి అవుతుంది. యజమా నులు 120 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వాడుకుంటే మిగిలిన యూనిట్లకు ఒక్కో యూ నిట్‌కు రూ.1.90 పైసలు వంతున విద్యుత్‌ శాఖ వినియోగ దారుడికి చెల్లిస్తుంది. ఇలా ఆదాయం కూడా పొందవచ్చు.

పథకం పొందాలంటే...

సూర్యఘర్‌ పథకానికి అందరూ అర్హులే. డాబాపై కనీసం 100 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. అక్కడ ఒక కిలో వాట్‌ సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా కిలోవాట్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి చేయవచ్చు. దానికి రూ.70 వేలు ఖర్చవుతుంది. అందులో రూ.30 వేలు ప్రభు త్వం భరిస్తుంది. కానీ లబ్ధిదారుడు ముందుగా రూ.70 వేలు చెల్లిస్తే తర్వాత రాయి తీ రూ.30 వేలు చెల్లిస్తారు..2 కిలోవాట్స్‌కు రూ.లక్షా 40 వేలు చెల్లిస్తే 60 వేలు సబ్సిడీగా ఇస్తారు. అక్కడ నుంచి ఇంకెన్ని కిలోవాట్లు పెంచుకున్నా ఒక్కో కిలో వాట్‌కు రూ.18 వేల వంతున మా త్రమే చెల్లించాల్సి ఉంటుంది. పీఎం సూర్యఘర్‌ పోర్టల్‌లో వినియోగదారుడి పేరు.. ఇంటి సర్వీ సు నెంబర్‌ రిజిస్టర్‌ చేసి, అక్కడ అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఇంటి స్థలం, భవనం డాక్యుమెంట్లు వంటివి అవసరం లేదు సూర్యఘర్‌ పోర్టల్‌లో నమోదైన వెంటనే అది ఆయా వెండర్లకు చేరుతుంది. జిల్లాలో 500 మంది వెండర్లు ఉన్నారు.వారిలో ఎవరో ఒకరు వచ్చి సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాల్‌ చేస్తారు.

ఎవరికెంత రాయితీ..

కిలోవాట్‌ సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు రూ.70 వేలు అయితే అందులో రూ.30 వేలు సబ్సిడీ ఉంది. బీసీలకు మరో 20 వేలు అంటే రూ.50 వేల సబ్సిడీ ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్‌లో బీసీ ల రాయితీకి ఆమోదం తెలిపారు. త్వరలోనే జీవో వస్తుంది.ఎస్సీ, ఎస్టీ వర్గాలకూ ఉచితంగా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక కాల నీలో సోలార్‌ సిస్టమ్‌ విద్యుత్‌ శాఖ ఆధ్వ ర్యంలోనే ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఎస్సీల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే పనిలో ఉన్నారు. కొన్ని గ్రామాలను గుర్తించారు.

Updated Date - Dec 17 , 2025 | 12:53 AM