Share News

సూర్యఘర్‌..స్లో!

ABN , Publish Date - Jul 14 , 2025 | 01:05 AM

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్‌ పఽథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై అవగాహన కల్పించకపోవడంతో పెద్దగా స్పందన కనిపించడంలేదు.

సూర్యఘర్‌..స్లో!

ఫీజు చెల్లించినవి 2900

1723 ఇళ్లకే సోలార్‌

పథకం నిర్వహణ గాలికి

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్‌ పఽథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై అవగాహన కల్పించకపోవడంతో పెద్దగా స్పందన కనిపించడంలేదు.జిల్లాలో సూర్యఘర్‌ పథకా నికి 10,867మంది దరఖాస్తు చేస్తున్నారు.కానీ ఇంత వరకూ అప్లికేషన్‌ ఫీజ్‌ కట్టినవారు 2900 మంది మాత్రమే. అందులో ఇళ్లకు సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకున్న వారు 1723 మంది మాత్రమే. ఇక్కడ సోలార్‌ సామర్థ్యం మొత్తం 1.186 మెగాగాట్లు. వీటిని వేగవంతం చేసే బాధ్యత విద్యుత్‌ శాఖకు ఉంది. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చొరవతీసుకుని డీఆర్‌డీఏ, మెప్మాలకు బాధ్యత అప్పగిం చా రు. ఈ శాఖల్లో గ్రామాలు, పట్టణాలకు చెందిన సెల్ప్‌హెల్ప్‌ గ్రూపులు ఉంటాయి. వారిని మోటి వేట్‌ చేసి వారి ఇళ్లను సూర్యఘర్లుగా మార్చ డానికి ప్రయత్నించారు.ఈ గ్రూపుల్లో లక్షల మంది మహిళలు ఉంటారు.అయితే ఇంత వరకూ డీఆర్‌డీఏ నుంచి సుమారు 250 మం ది, మెప్మా నుంచి సుమారు 90 మంది వరకూ ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు.

ఈ పథకం పొందాలంటే...

ఈ పథకానికి అందరూ అర్హులే. డాబా మీద కనీసం 100 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది.అక్కడ ఒక కిలోవాట్‌ సోలార్‌ ద్వారా కిలోవాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. దానికి రూ.70వేలు ఖర్చు అవుతుంది.అందులో రూ.30 వేలు ప్రభుత్వం భరిస్తుంది.కానీ లబ్ధిదారుడు ముందుగా రూ.70 వేలు చెల్లిస్తే తర్వాత రాయితీ రూ.30 వేలు ఇస్తుంది.అన్ని వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది. కిలోవాట్లను బట్టి చెల్లించాల్సిన సొమ్ము కొద్దిగా పెరుగుతుంది. సోలార్‌ ఇన్‌స్టాల్‌ చేయడానికి జిల్లాలో 500 మంది వెండర్లు ఉన్నారు.బీసీలు ఎవరైనా ముందుకు వచ్చిన సూర్యఘర్‌గా తమ ఇంటిని మార్చుకోవాలంటే ప్రస్తుతం ఇచ్చే రాయితీతో పాటు మరో రూ.20 వేలు రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఎస్పీలకు ఇంకా రాయి తీకి గురించి ప్రకటించలేదు.కానీ పూర్తిగా ఉచితంగా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jul 14 , 2025 | 01:05 AM