రాతలు..చెరిగాయ్!
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:00 AM
సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మను తొల గించారు.వాటితో పాటు రాళ్ల మీద వైఎస్‌ఆర్ జగ నన్న భూరక్షణ 2020 అనే రాతలు తొలగించారు.
వైసీపీ రాతలూ చెరిపేశారు
ఆగస్టు నుంచి కొత్త పాస్ బుక్స్
31 గ్రామాల్లో కూటమి సర్వే
సర్వే నెంబర్లు ఇక గురుతులే
ఎల్‌పీఎం, పీపీఎం పేరిట అమలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మను తొల గించారు.వాటితో పాటు రాళ్ల మీద వైఎస్‌ఆర్ జగ నన్న భూరక్షణ 2020 అనే రాతలు తొలగించారు. ఇక కొత్త పాసు పుస్తకం వచ్చింది. ఆగస్టు నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దాని మీద గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా సీఎం బొమ్మల వంటి దరిద్రం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,సింబల్ ఉంటుంది. రెవెన్యూశాఖ పేరు ఉంది. సింబల్ పైన భూమి యాజమాన్యపు హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం అని మాత్రం ఉంది. భూమి యజమాని ఫోటో, వారి వివరాలు అందులో ఉన్నాయి. గత ప్రభుత్వం జిల్లాలో 163 గ్రామాల్లో 2,14,319 రాళ్లు పాతి దానిపై బొమ్మలు వేసింది. రాతలు రాసింది. ఈ ప్రభుత్వం వాటిని తొలగించి ఆనవాళ్లు లేకుండా చేసింది.
జిల్లాలో 6 లక్షల ఎకరాలు
జిల్లాలో మొత్తం 272 గ్రామాల్లో 605331.86 ఎకరాల విస్తీర్ణం ఉంది. రాజమహేంద్రవరం డివిజన్ 10 మండలాల పరిధి 123 గ్రామాల్లో 299963.2 ఎకరాలు, కొవ్వూరు డివిజన్ 9 మండ లాల పరిధి 149 గ్రామాల్లో 315268.66 ఎకరాలు ఉన్నాయి. 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో కొన్ని గ్రామాల్లో సర్వే చేసి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ముద్రించిన సంగతి తెలిసిందే. సరిహద్దు రాళ్లు పేరిట రాళ్లు వేసి వాటిపై జగన్ బొమ్మతో పాటు వైఎస్‌ఆర్ జగనన్న భూరక్ష అనే రాతలు రాసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో పెద్ద అలజడి మొదలైంది. అప్పట్లో తెలుగుదేశం కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ చట్టా న్ని రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం భూహక్కు చట్టాన్ని రద్దు చేశారు. అంతేకాకుండా పైలెట్ గ్రామాల పేరుతో రీసర్వే ఆరంభించారు. మొదట 16 గ్రామాలు, రెండో దశ 15 గ్రామాల్లోనూ సర్వే చేస్తున్నారు. సర్వే వేగంగా జరుగుతోంది.ఈ నెల 14 నుంచి మిగతా గ్రామాల్లో సర్వే ఆరంభి స్తారు. నవంబరు నాటికి పూర్తి చేసే యోచనలో ఉన్నారు.
సర్వే నంబర్ ఉండదు..
ఇంతవరకూ మీ భూమి ఎక్కడ ఉందని అడి గితే సర్వే నంబర్ చెప్పేవారు. ఇక సర్వే నంబర్ అనే మాట వినిపించదు. ఇప్పటికే రీ సర్వే జరిగిన ప్రాంతాల్లో సర్వే అనే మాటను తొలగిస్తున్నారు. వ్యవసాయ భూమికి సంబంధించిన లాండ్ పార్శి ల్ మ్యాంప్ (ఎల్‌పీఎం)ను అమల్లోకి వచ్చారు. ఒక చోట ఒకరికి చెందిన భూమి అంతా ఒక ఎల్ పీఎం నంబర్‌లోకి వస్తుంది. ఇక ఇళ్ల స్థలాలు,ఇళ్లు, ఇతర ఆస్తుల విషయాల్లో ప్రాపర్టీ పార్శిల్ మ్యాప్ (పీపీఎం)ను వాడతారు.ఒక వ్యక్తికి సంబంధించిన స్థలానికి ఒకే పీపీఎం నంబర్ ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఈ నెంబర్‌తోనే సంబంధిత ఆస్తి ఉంటుంది. ఇక గజాల కొలతలు మానేస్తున్నారు. చదరపు మీట రులోనే కొలతలు లెక్కలు చూపిస్తారు. ఎకరానికి 4046. 856 చదరపు మీటర్లు అని అర్ధం .