Share News

వేదాలు, వేదపండితులకు ఎల్లప్పుడు గౌరవం

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:23 AM

అంబాజీపేట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వేదాలు, వేదపండితులకు ఎల్లప్పుడు మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్వీ రమణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మినారాయణ అవధాని స్మృతియుర్ధం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనపాటి ఆధ్వర్యంలో వడ్లమాని లక్ష్మినారాయణ మోమోరియల్‌ ట్రస్టు పేరిట వేద సభ మంగళవారం ని

వేదాలు, వేదపండితులకు ఎల్లప్పుడు గౌరవం
నందంపూడిలో రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న వేదపండితులు

వేదసభలో పాల్గొని తన్మయత్వం పొందా

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

కోనసీమ జిల్లా నందంపూడిలో వేద సభ

అంబాజీపేట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వేదాలు, వేదపండితులకు ఎల్లప్పుడు మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్వీ రమణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మినారాయణ అవధాని స్మృతియుర్ధం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనపాటి ఆధ్వర్యంలో వడ్లమాని లక్ష్మినారాయణ మోమోరియల్‌ ట్రస్టు పేరిట వేద సభ మంగళవారం ని ర్వహించారు. సభకు మహా మహోపాధ్యాయ శాస్త్ర నిధి విశ్వనాధ గోపాలకృష్ణశాస్ర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టీస్‌ ఎన్వీ ర మణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వేదసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర, జాతీయ, అం తర్జాతీయ స్థాయిలో వేద సభలు నిర్వహిస్తే వేదాల ప్రాసశ్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుని.. దక్షిణ భారతదేశంలోని కోనసీమ ప్రాంతం వేద పండితులకు పుట్టిలన్నారు. నాకు చిన్నప్పటి నుంచి వేదసభలో పాల్గొనాలనే కోరిక ఉండేదని, తాను నందంపూడి వేదసభలో పాల్గొని వేదఘోషను ఆస్వాదించడంతో చిన్ననాటి కోరిక నెరవేరిందని రమణ తెలిపారు. వేదసభలో పాల్గొని తన్మయత్వం పొందానన్నారు. తొలుత నంద ంపూడి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అలాగే వడ్లమాని లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులతో రమణ కుటుంబసభ్యులు కొద్దిసేపు మాట్లాడారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో తిరుపతిలో తనతో సుబ్రహ్మణ్యఘనాపాటి తీయించుకున్న ఫొటోల ను చూసి ఆనందంపొందారు. వేంకటేశ్వరస్వామి దయ వల్ల తాను ఆ పదవిలో ఎంతో సమర్ధవంతంగా పనిచేశానన్నారు. కార్యక్రమం అనంతరం వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని మనువడు ప్రముఖ వేదపండితులు ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్య రవితేజ ఘనాపాటికి జస్టీస్‌ రమణ సింహతలాటాన్ని అలకరించి సత్కరించారు. లక్ష్మినారాయణ అవధాని మోమోరియల్‌ ట్రస్టుకు రూ.2లక్ష చెక్కును విరాళంగా అందించారు. జస్టీస్‌ రమణకు తహశీల్దార్‌ చినబాబు, సీఐ రుద్రరాజు భీమరాజు మొక్కలను అ ందించి ఘనస్వాగతం పలికారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పీకే రావు, టీటీడీ బోర్డు మాజీ డైరక్టర్‌ డొక్కా నాధ్‌బాబు, ఎంపీటీసీ వడ్లమాని పద్మావతి, పితాని వీరాస్వామి, అరిగెల బలరామమూర్తి, వేదపండితులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:23 AM