మండే ఎండలకు మందు!
ABN , Publish Date - May 20 , 2025 | 12:38 AM
వేసవి ఉపశమనం కోసం మందుబాబులు తెగ తాగేస్తు న్నారు. దీంతో మద్యం విక్రయాలు రయ్‌మని పరుగులు తీస్తు న్నాయి. వేసవి తీవ్రత కారణంగా గత నెల నుంచి మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఒక్క ఏప్రిల్‌లోనే మం దుబాబులంతా కలిపి ఉమ్మడి జిల్లాలో రూ.293 కోట్ల మద్యం తాగేశారు.
ఉమ్మడి జిల్లాలో బీర్లు పొంగాయ్
వేసవి ఉపశమనం పేరుతో తెగతాగేశారు
ఉమ్మడి తూ.గో.జిల్లాలో పెరిగిన అమ్మకాలు
ఏప్రిల్‌లో రూ.293 కోట్ల మద్యం విక్రయాలు
గతేడాది పోల్చితే రూ.17 కోట్లు అధికం
రికార్డు స్థాయిలో బీర్లను తాగేసిన ప్రియులు
గత నెలలో 2.81 లక్షల బీరు కేసులు
గతేడాది ఇదే నెలలో 1.21 లక్షల కేసులే
గతేడాదితో పోల్చితే 133 శాతం అధికం
ఈ నెలా మద్యం విక్రయాలు రయ్
16 నాటికి రూ.150 కోట్ల మేర సేల్స్
బీరు కేసులు 1.49 లక్షల విక్రయం
(కాకినాడ/ రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
వేసవి ఉపశమనం కోసం మందుబాబులు తెగ తాగేస్తు న్నారు. దీంతో మద్యం విక్రయాలు రయ్‌మని పరుగులు తీస్తు న్నాయి. వేసవి తీవ్రత కారణంగా గత నెల నుంచి మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఒక్క ఏప్రిల్‌లోనే మం దుబాబులంతా కలిపి ఉమ్మడి జిల్లాలో రూ.293 కోట్ల మద్యం తాగేశారు. గతేడాది ఇదేనెలలో విక్రయాలతో పోల్చితే రూ.17 కోట్లు అధికం. బీర్ల విక్రయాలైతే ఏకంగా 133 శాతం పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో మందుబాబులు 1.21 లక్షల బీరు కేసులు తాగేస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.81 లక్షల బీరు కేసులు ఎత్తేశారు. విభజిత జిల్లాల వారీగా పరిశీలిస్తే కాకినాడ జిల్లాలో గతేడాది ఏప్రిల్‌లో రూ.95.52 కోట్లు అమ్మకా లుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.104 కోట్లకు చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది ఏప్రిల్‌లో రూ.90.76 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.100.23 కోట్లకు చేరింది. కోనసీమను మినహాయిస్తే ఈ రెండు జిల్లాల్లో విక్రయాలు భారీగా పెరిగాయి.
ఈనెలలో అప్పుడే రూ.150 కోట్లకుపైగానే..
మే నెలలోను మందుబాబులు తగ్గేదేలే అన్నట్టు తెగ తాగే స్తున్నారు. ఇప్పటివరకు కాకినాడ జిల్లాలో రూ.53 కోట్ల విలువైన మద్యం తాగేశారు. బీరు కేసులు గతేడాది మే నెల 16 వరకు జిల్లాలో 24,339 విక్రయించగా ఇప్పుడు 56,375 అమ్ము డయ్యాయి. కోనసీమ జిల్లాలో గతేడాది మే నెల మొత్తం మీద రూ.98.88 కోట్ల సరుకు విక్రయించగా ఈనెలలో ఇప్పటివరకు రూ.45.41కోట్ల మద్యం అమ్ముడైంది. తూర్పుగోదావరి జిల్లాలో 58,950 ఐఎంల్ కేసులు, 50,587 బీరు కేసులు విక్రయించడంతో రూ.49.46 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు మందుబాబులకు షాక్ కొట్టాయి. నాసిరకం బ్రాండ్లకు ప్రీమియం ధరలు వసూలు చేసి వందల కోట్లు పిండేశారు. ప్రస్తుత ప్రభుత్వం ధరలు అమాం తం తగ్గించేసింది. బీరు, ఐఎంఎల్ ప్రముఖ బ్రాండ్లను అన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంచింది. ధరలు తగ్గడం.. వేసవితో మందుబాబులు తెగ తాగేయడంతో అమ్మకాలు పెరిగాయి.
ఊదిపారేస్తున్నారంతే...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది ఏప్రిల్‌లో బీర్లు, ఇతర ఐఎంఎల్ మద్యం విక్రయాలు కలిపి రూ.276 కోట్లు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విక్రయాలు రూ.293 కోట్లకు పెరిగాయి. ఇందులో అత్యధికంగా బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో 1,21,396 కేసుల బీర్లు విక్రయించగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 2,81,637 కేసుల బీర్లు మందుబాబులు తాగేశారు. బీర్ల విక్ర యాలు అప్పటితో పోల్చితే ఈసారి 133 శాతానికిపైగా పెరిగాయి.
ఫ కాకినాడ జిల్లాలో 2024 ఏప్రిల్‌లో రూ.95.52 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో 41,940 కేసుల బీర్లు ఉండగా, ఐఎంఎల్ మద్యం 96,317 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌కు వచ్చేసరికి ఈనెలలో కాకినాడ జిల్లాలో విక్రయాలు రూ.104కోట్లకు పెరిగింది. ఒక్క బీర్లే ఏకంగా 97,796 కేసులు అమ్ముడయ్యాయి. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలో గత నెలలో ఏకంగా రూ.26కోట్ల మద్యం అమ్ముడైంది. కాకినాడ సౌత్ స్టేషన్ పరిధిలో రూ.18 కోట్లు, తుని పరిధిలో రూ.15.84 కోట్ల విక్రయాలు జరిగాయి.
ఫ తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది ఏప్రిల్ నెలలో రూ.90.76 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 100.23కోట్ల మద్యం అమ్ముడైంది. ఒక్క బీర్ల విక్రయాల్లో ఏకంగా 114 శాతం పెరుగుదల నమోదైంది. అత్యఽధికంగా రాజమహేంద్రవరం నార్త్ స్టేషన్ పరిధిలో గత నెలలో రూ.22.66 కోట్లు మద్యం విక్రయాలు జరగ్గా, బీర్ల విక్రయాల్లో 131 శాతం వృద్ధి నమోదైంది. రాజ మహేంద్రవరం దక్షిణం పరిధిలో రూ.20.44 కోట్లు, నిడదవోలు పరిధిలో 13.44కోట్లు, దేవరపల్లి 12.33 కోట్లు, కోరుకొండ 8.91 కోట్లు చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి. దేవరపల్లి సర్కిల్ పరిధిలో గతేడాది ఏప్రిల్‌లో 3,623 కేసుల బీర్లు అమ్ముడైతే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 9,253 బీర్ల కేసులు విక్రయించారు. బీర్ల విక్ర యాల్లో గతేడాదితో పోల్చితే 155 శాతం అధికం.
ఫ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2024 ఏప్రిల్‌లో రూ.90.11 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.88.81 కోట్లు నమోదయ్యాయి. ఇక్కడ గతేడాదితో పోల్చితే ఏప్రిల్‌లో విక్రయాలు కొంత తగ్గాయి. ప్రధానంగా ఈ జిల్లాలో 2024 ఏప్రిల్‌లో ఈ జిల్లాలో 95,444 కేసుల ఐఎంఎల్ మద్యం అమ్ముడైతే ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,17,484 కేసుల ఐఎంఎల్ అమ్ముడైంది. బీరు కేసులు అప్పట్లో 34,036 విక్రయిస్తే.. గత నెలలో 79,005 కేసులు విక్రయించారు. బీర్ల విభాగంలో అమ్మకాలు అప్పటితో పోల్చితే 132 శాతం పెరిగాయి.