అమ్మా! కాలువలోకి దూకేస్తున్నాను..
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:12 AM
అ మ్మా! నేను కాలువలోకి దూకేస్తున్నానంటూ ఓ యువకుడు తన పుట్టినరోజునాడు.. తల్లికి ఫోనుచేసి కాలువలోకి దూకిన ఉదంతం వేమగిరిలో జరిగింది.
కడియం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అ మ్మా! నేను కాలువలోకి దూకేస్తున్నానంటూ ఓ యువకుడు తన పుట్టినరోజునాడు.. తల్లికి ఫోనుచేసి కాలువలోకి దూకిన ఉదంతం వేమగిరిలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన పెదవేగి శ్రీను కు టుంబం ప్రస్తుతం వేమగిరి జగన్ కాలనీలో నివాసం ఉంటోంది. వీరి కుమారుడు జీవన్‌కుమార్(16) కడియంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మం గళవారం సాయంత్రం వేమగిరి కాలువ కాలిబాట వంతెన వద్దకు వె ళ్లాడు. తల్లి గౌరీకి ఫోను చేసి నేను కాలువలోకి దూకేస్తున్నాను.. మీరు జాగ్రత్త! అంటూ కాలువలోకి దూకేశాడు. దీం తో జీవన్‌కుమార్ తల్లి స్పృహతప్పి పడిపోయింది. జీవన్ కాలువలో పడిపోయాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు, స్నేహితు లు అక్కడికి చేరుకున్నారు. జీవన్‌కుమార్ ఆ చూకీ కోసం గాలిస్తున్నారు. కాగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని సీఐ తెలిపారు.