క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:01 AM
విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని హస్యనటుడు గౌతమ్ రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

రాయవరం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని హస్యనటుడు గౌతమ్ రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాయవరం సాయితేజ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అకడమిక్ డైరెక్టర్లు కర్రి భానురేఖా, సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పలు అంశాలపై మాట్లా డారు. అనంతరం సిటీ నటుడు గౌతమ్‌రాజు మాట్లాడుతూ విద్యతోనే సమాజాభివృద్థి సాధ్యమన్నారు. ఈసందర్భంగా చదువు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన విద్యార్థులకు వారు బహుమతులు అందజేశారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి పాటలకు అనుగుణంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో రచయిత పైడిపాల, డాక్టర్ జీఎస్‌ఎన్ రెడ్డి, ఎంఈవో వై.సూర్యనారాయణ, ఎస్‌బీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్టు అధినేత సత్తి బుల్లి స్వామిరెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.