విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:54 PM
విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచు కోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధా న న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శని వారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు మంచి, చెడు స్పర్శల గురించి, నల్సా-పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవల పథకం-202 4పై అవగాహన కల్పించారు. విద్యా ర్థులు చదువుపై ఆసక్తి కలిగి ఉం డాలన్నారు.
పీడీజే గంధం సునీత
రాజమహేంద్రవరం, నవంబరు 22(ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచు కోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధా న న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శని వారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు మంచి, చెడు స్పర్శల గురించి, నల్సా-పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవల పథకం-202 4పై అవగాహన కల్పించారు. విద్యా ర్థులు చదువుపై ఆసక్తి కలిగి ఉం డాలన్నారు. పిల్లల అమాయకత్వా న్ని అవకాశంగా తీసుకొని కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నార ని, మోస పూరితంగా అక్రమ కార్య కలాపాలకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అందువల్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల పట్ల ఏ ఒక్కరూ హద్దులు దాటి ప్రవర్తించడా నికి వీల్లేదన్నారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా నల్సా హెల్ప్‌లైన్ నెంబరు 15100కి లేదా డీఎల్‌ఎస్‌ఏ దృష్టికి తీసుకురావా లన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.