సరదా కాస్తా విషాదం
ABN , Publish Date - May 14 , 2025 | 12:27 AM
ప్రత్తిపాడు, మే 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి ఏలేరు ఎడమ కాలువలో మంగళవారం సాయ ంత్రం నలుగురు విద్యార్థులు స్నానానికి దిగారు.వీరిలో ఒకరు గల్లంతు కాగా మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మరో ఇద్దరు విద్యా ర్థులను స్థానికులు కా
ఏలేరు ఎడమ కాలువలో స్నానానికి దిగి విద్యార్థి గల్లంతు
పోలీసుల గాలింపు చర్యలు
తీవ్ర అస్వస్థతకు గురైన మరొకరు
బయటపడిన ఇద్దరు విద్యార్థులు
ప్రత్తిపాడు, మే 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి ఏలేరు ఎడమ కాలువలో మంగళవారం సాయ ంత్రం నలుగురు విద్యార్థులు స్నానానికి దిగారు.వీరిలో ఒకరు గల్లంతు కాగా మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మరో ఇద్దరు విద్యా ర్థులను స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం నుంచి విశాఖపట్నం వెళ్లే ఏలేరు ఎడమ కాలువలో పెదశంకర్లపూడి వద్ద మంగళవారం సా యంత్రం అదే గ్రామానికి చెందిన పంది వీర వెంకట సత్యనారాయణ అలియాస్ విఘ్నేష్ (14), కాకినాడ సిరిబాబు (14), ఏళ్ళ సోరాబత్తుల రాజా (14), ఏళ్ళ శివ(14) సరదాగా స్నా నాలు చేసేందుకు వెళ్లారు. వారిలో విఘ్నేష్, సిరిబాబు కాలువ ఉధృతికి కొట్టుకుపోగా విఘ్నేష్ గల్లంతయ్యాడు. కాలువలోకి దిగుతున్న రా జా, శివలను స్థానికులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. సిరిబాబు అధికంగా నీళ్లు తాగేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారి వెంటనే ఏలేశ్వ రం ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన విఘ్నేష్ ఆచూకీ తెలియరాలేదు. ఆ నలుగురు లంపకలోవ జిల్లా పరిషత్‌లో హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. పెదశంకర్లపూడిలోని పంది రాంబాబు, సత్యవేణి దంపతుల ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన విఘ్నేష్ ఏలేరు ఎడ మ కాలువలో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విఘ్నేష్ ఇంటికి ప్రత్తి పాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. సంఘటనా స్థలానికి వచ్చి విఘ్నేష్ ఆచూకీ కోసం ఉధృతంగా చర్యలు చేపట్టాలని ఏలేరు అధికారులను ఆదేశించారు. కాలువలో నీటి ఉధృతిని తగ్గించాలని సూచించారు. విఘ్నేష్ ఆచూకీ కోసం ప్రత్తిపాడు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యల్లో పల్గొన్నారు. స్థానిక సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్‌ఐ లక్ష్మీకాంతం సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన విఘ్నేష్ ఆచూకీ కోసం ముమ్మర చర్యలు చేపట్టారు. మంగళ వారం రాత్రి వరకు గాలింపు చేపట్టినా విఘ్నే ష్ ఆచూకీ తెలియరాలేదని, బుధవారం ఉద యం గాలింపు చేపడతామని ఎస్‌ఐ తెలిపారు.