Share News

వీధి వ్యాపారులకు రూ.31.25 లక్షల రుణాలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:06 AM

రాజమహేంద్రవరంలో వివిధ రకాల ఉత్పత్తులను వీధి విక్రయాలు చేసే 81 మందికి రూ.31.25 లక్షల రుణాలను నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, మెప్మా పీడీ టి.కనకరాజు అందజేశారు. శనివారం స్థానిక ఆనం కళా కేంద్రంలో జరిగిన లోక్‌ కళ్యాణ్‌ మేళా కార్యక్రమానికి అడిషనల్‌ కమిషనర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి మా ట్లాడారు.

వీధి వ్యాపారులకు రూ.31.25 లక్షల రుణాలు
రుణాల చెక్కును అందిస్తున్న ఏసీ రామలింగేశ్వర్‌

  • కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌

  • రాజమహేంద్రవరంలో లోక్‌ కళ్యాణ్‌ మేళా

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో వివిధ రకాల ఉత్పత్తులను వీధి విక్రయాలు చేసే 81 మందికి రూ.31.25 లక్షల రుణాలను నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, మెప్మా పీడీ టి.కనకరాజు అందజేశారు. శనివారం స్థానిక ఆనం కళా కేంద్రంలో జరిగిన లోక్‌ కళ్యాణ్‌ మేళా కార్యక్రమానికి అడిషనల్‌ కమిషనర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి మా ట్లాడారు. వీఽధి వ్యాపారులు ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారంలో రాణించాలన్నారు. రుణగ్రహీతలు బ్యాంకుల ద్వారా రుణం పొందడం ద్వారా ప్రభుత్వ రాయితీలను పొందే అవకాశం ఉంటుందన్నారు. వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు పీఎం స్వనిధి 2.0 ద్వారా మొదటి విడ తలో రూ.15 వేలు, రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడతలో రూ.50 వేలు వరకు రుణాలు అందనున్నాయన్నా రు. కనకరాజు మాట్లాడుతూ 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకాన్ని పునఃరూపకల్పన చేసి పీఎం స్వనిధి 2.0 పథకం కింద జిల్లాలో కొత్తగా దరఖాస్తులను ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. ఈ మేళా ద్వారా వీధి వ్యాపారులు, వారి కుటుంబీకులకు 8 అంశాల్లో ప్రభుత్వం పథకాల ద్వారా సామాజిక భద్రత కల్పిస్తుందన్నారు. తొలుత మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్‌ జి.కోటయ్య, జిల్లా పుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రూక్కయ్య, లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు ప్రసాద్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఎఫ్‌సీసీ ఇన్‌చార్జి చిట్టితల్లి, సీఎంఎం రామలక్ష్మి, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ రెడ్డి, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యానాపు యేసు, నాయకులు కాశి నవీన్‌కుమార్‌, మజ్జి రాంబాబు, సత్యనారాయణ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 01:06 AM