Share News

ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలి

ABN , Publish Date - May 04 , 2025 | 11:59 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న మారణ కాండను ఆపాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు కోరారు.

ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న చిట్టిబాబు

  • పౌరహక్కుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు చిట్టిబాబు

రాజమహేంద్రవరం సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న మారణ కాండను ఆపాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు కోరారు. రాజమహేంద్రవరం అంబేడ్కర్‌ భవన్‌లో ప్రగతి శీల కార్మిక సమాఖ్య రాష్ట్రాధ్యక్షుడు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కోకన్వీనర్‌ ఎస్‌కే మస్తాన్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కొద్దిమంది కార్పొరేట్లకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అనేక మందిని చంపుతోందని ఆరోపించారు. మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం కల్పించడానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. సమావేశంలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు రమ, వేమన ఫౌండేషన్‌ నాయకుడు ఆచంట వరప్రసాద్‌, హ్యూమన్‌ రైట్స్‌ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తాతపూడి ప్రకాష్‌, దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:59 PM