సులువుగా డబ్బు సంపాదించాలనుకుని నిలువునా మోసపోయి...
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:27 AM
రాజానగరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ మాయాజాలం వలలో చిక్కుకుని అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ వ్యాపారం పేరుతో నిలువునా మోస పోయి ఏకంగా రూ.74 లక్షలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం
స్టాక్ మార్కెట్ వ్యాపారం మోజులో పడి రూ.74 లక్షల సమర్పణ
రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
రాజానగరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ మాయాజాలం వలలో చిక్కుకుని అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ వ్యాపారం పేరుతో నిలువునా మోస పోయి ఏకంగా రూ.74 లక్షలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గ్రామానికి చెందిన కాదా ఉమాకాంత్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అకౌంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 17న ట్రేడింగ్ కోసం ఫేస్‌బుక్‌లో వెతికాడు. సావర్ట్ ట్రేడింగ్ యాప్ అనే పేరుతో లింక్ రాగా దానిని ఓపెన్ చేశాడు. మరుక్షణ మే సావర్ట్ ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వగా గ్రూప్‌లో యాడ్ అయినట్టు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే డీమేట్ అకౌంట్ ఓపెన్ చేయాలని మెసేజ్ వచ్చింది. దానిలో వివరాలు పూర్తి చేయడంతో అకౌంట్ క్రియేట్ కావడంతో దఫదఫాలుగా సుమారు పదకొండుసార్లు మొత్తం రూ.74,36,403 పెట్టుబడి పెట్టాడు. అనంతరం పెట్టిన అమౌంట్ ఫ్రీజ్ అయ్యిందని, విత్‌డ్రా చేయాలంటే మరో రూ.58,55,000 వేయాలని చెప్పడంతో మోసపోయాననే అనుమానంతో బాధితుడు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు ఎస్‌ఐ జివివి..సత్యనారాయణ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు..