నేటికీ పునాదుల్లోనే..
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:56 AM
రైతు బజార్ ధవళేశ్వరం వాసుల కల. ఆ కలను నిజం చేస్తూ 2022 సంవత్సరంలో అప్పటి వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ స్థానిక ప్రా ఽథమిక వైద్యశాల పక్కన రైతు బజార్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సుమారు రూ.44 లక్షల అంచనా వ్యయంతో వైసీపీ నాయకుడికి పనులు అప్పగించారు. పనులు మొదలెట్టి పునాది, పిల్లర్ల నిర్మాణం వరకు వేగంగా పూర్తయ్యాయి.
ధవళేశ్వరంలో నిలిచిపోయిన రైతు బజార్ నిర్మాణం
2022లో భూమిపూజ
కూటమి ప్రభుత్వంలో అయినా పూర్తి చేయాలంటున్న గ్రామస్థులు
ధవళేశ్వరం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రైతు బజార్ ధవళేశ్వరం వాసుల కల. ఆ కలను నిజం చేస్తూ 2022 సంవత్సరంలో అప్పటి వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ స్థానిక ప్రా ఽథమిక వైద్యశాల పక్కన రైతు బజార్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సుమారు రూ.44 లక్షల అంచనా వ్యయంతో వైసీపీ నాయకుడికి పనులు అప్పగించారు. పనులు మొదలెట్టి పునాది, పిల్లర్ల నిర్మాణం వరకు వేగంగా పూర్తయ్యాయి. దీని కోసం కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన వైసీపీ నాయకుడు సుమారు రూ.9లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అటుపై రన్నింగ్ బిల్లు కోసం నాయకులు, అధికారులు చుట్టూ తిరిగి తిరిగి బిల్లు రాకపోవడంతో పనులు నిలిపివేశాడు. కొంత కాలం తరువాత సుమారు రూ.6 లక్షలు బిల్లు చెల్లించారు. తదుపరి ప్ర భుత్వం మారడం, టీడీపీ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం 25శాతానికి పైగా పూర్తికాని పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో రైతుబజార్ పనులు నిలిచిపోయాయి. మేజర్ పంచాయతీగా ఉన్న ధవళేశ్వరం గ్రామంలో కూటమి ప్రభుత్వంలోనైనా రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.