మహా పండుగ కాకినాడలో ఘనంగా టీడీపీ మినీ మహానాడు
ABN , Publish Date - May 23 , 2025 | 02:13 AM
:ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి, ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
కాకినాడ, మే 22, (ఆంధ్రజ్యోతి):ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి, ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ వెల్లడించారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన కాకినాడ జిల్లా మినీమహానాడు నిర్వహించారు. ముం దుగా ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పార్టీకి వెన్నెముకగా నిలిచిన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. పార్టీ ముఖ్యనేతలు కొందరు కార్యకర్తల గురించి కాస్త ఆవేదనగా మాట్లాడడంపై ఆయన స్పం దించారు.పార్టీ విజయానికి కృషి చేసిన వారందరికీ గుర్తింపు తీసుకువచ్చేలా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, లోకేశ్‌ల దృష్టికి తీసుకువెళతామన్నారు.2047 నాటికి దేశంలో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్టీఆర్ పాటించిన విధివిధానాలే నేటికీ పార్టీ మనుగడకు మూలం అన్నారు. పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్యకర్తల ఉనికిని కాపాడాలని కోరారు. కాకినాడ జిల్లాలో పార్టీ పరిస్థితి అసలు బాగోలేదన్నారు. ఒకేపార్టీకి పదవులు కట్టబెట్టడం సరైన విధానం కాదని..ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం కూడా భావ్యం కాదన్నారు. ఎంపీ సానా సతీష్‌బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా అభివృద్ధికి, ఎస్‌ఈ జెడ్‌లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. ఎస్‌ఈజెడ్‌లో పెట్రోలియం కారిడార్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు.కాకినాడలో 11 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌ను 2500 బెడ్స్‌తో ఆధునికీకరిస్తామన్నారు.కాకినాడలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.జ్యోతుల నవీన్ మాట్లాడుతూ కార్యకర్తలను విస్మరించవద్దని సూచించారు. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ సామర్లకోట, పెద్దాపురం పట్టణాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే డీగ్రీ కాలేజీ కావాలని, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని, ఆనూరు, కొండపల్లి గ్రామాలకు నీరు ఇవ్వాలని కోరారు. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అన్నారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మమాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ చేపట్టాలని, పురుషోత్తపట్నం పనులు చేపట్టాలని కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కాకినాడ రూరల్‌లోని ఆరు కీలక పంచాయతీలను విలీనం చేయకపోతే పంచాయతీ ఎన్నికలైనా నిర్వహించాలని కోరారు.కాకినాడ బీచ్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తీర్మానం చేశారు. కాకినాడ జిల్లాలో పార్టీ నేతలకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ మహానాడుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఉదయం ఎనిమిదిగంటలకే సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. చాలా మంది బయటే ఉండిపోయారు. స్ర్కీన్‌లపై కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో తోట నవీన్,వనమాడి మోహన్ వర్మ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, కటకంశెట్టి బాబీ, పెంకే శ్రీనివాసబాబా, వాసిరెడ్డి ఏసుదాసు, చప్పిడి వెంకటేశ్వరరావు, మల్లిపూడి వీరు,తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, పోతుల మోహనరావు, తుమ్మల సునీత, నల్లూరి తులసి, రామదేవు సీతయ్య దొర, సబ్బతి ఫణీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలివీ : ఏలేరు ఫేజ్-2 (సుద్దగడ్డ కొండకాలువ) పనులు ప్రారంభించాలి.యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఎన్‌టీపీసీకు సేకరించిన సుమారు 600 ఎకరాల భూమిని రూ.వెయ్యికోట్లకు యాజమాన్యం విక్రయించుకుంది.సంస్థ రైతులను మోసగించి, ఏ కంపెనీ నిర్మాణాలు చేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. కేఎస్‌ఈజెడ్‌లోని అరబిందో, ఇతర ఫార్మాస్యూటికల్ కంపెనీల ద్వా రా వచ్చే కాలుష్యాన్ని నిర్మూలించి, మత్స్యకారుల ఉపాధిని కాపాడాలి.కేఎస్‌ఈజెడ్ భూమి రైతులకు అదనంగా ఇచ్చి నట్టు ఈ రైతులకు చెల్లింపులు చేయాలని తీర్మానించారు.
కొవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి
జీజీహెచ్(కాకినాడ) మే 22 (ఆంధ్ర జ్యోతి): కేంధ్ర, రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజలు కొవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డిఎంహెచ్‌వో) డాక్టర్ జె.నరసింహ నాయక్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సూచించారు. కొన్ని దేశాల్లో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్ట్‌లలో కొవిడ్ - 19 నిబంధనలను విధిగా పాటించాలన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్బిణీలు అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుంచి బయటికి రాకపోవడం శ్రేయస్కరమన్నారు. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ము ఖ్యంగా మాస్క్ ధరించి, సామాజిక దూ రం పాటించాలన్నారు. తద్వారా వైరస్‌ను అదుపులో ఉంచవచ్చన్నారు. ముఖ్యంగా ఎదుటవారితో కరచాలనం చేయరాదన్నా రు. గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాల్లో నివసించాలన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులు సమీప ఆసుపత్రుల్లో వైద్యాధికారి సూచనలు మేరకు తగిన మందులు వాడాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలన్నారు. జ్వరం, రొంప, దగ్గు, గొంతునొప్పి, నాలుక రుచి లేకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ముక్కు కారడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనబడితే అర్హులైన వైద్యుల సూచనలు పాటించాలని, ఇప్పటివరకు కాకినాడ జిల్లాలో ఎటువంటి కొవిడ్ కేసులు నమో దు కాలేదని డాక్టర్ నాయక్ కోరారు.
జిల్లాలో మరో మూడు అన్న క్యాంటీన్లు
కలెక్టరేట్(కాకినాడ), మే 22(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లాలో మరో మూడు అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం రూ.1.83కోట్లు నిధులు విడుదల చేసింది. దీనిలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం, జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో, పిఠాపురం నియోజకవర్గం లో యూ.కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తున్నా రు. ఒక్కొక్క అన్న క్యాంటీన్‌కు రూ.61 లక్షల చొప్పున కేటాయించారు. జగ్గంపేట లో అన్న క్యాంటీన్‌కు శుక్రవారం శంకు స్థాపన చేయనున్నారు. మరో మూడు నెలల్లో వీటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజ లకు అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.
మహా పండుగ
కాకినాడలో ఘనంగా టీడీపీ మినీ మహానాడు