Share News

పింఛన్‌.. టెన్షన్‌!

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:37 AM

కూటమి ప్రభుత్వం ఏం చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుంది.లోతుగా ఆలోచించి నిర్ణ యం తీసుకుంటున్నారు

పింఛన్‌.. టెన్షన్‌!

ఈ నెల 12న ఇస్తారని వాయిదా

పంపిణీపై అయోమయం

8,541 మందికి అర్హత

పంపిణీకి రూ.3.41 కోట్లు

ఉమ్మడి జిల్లాలో ఇదీ లెక్క

సామర్లకోట, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఏం చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుంది.లోతుగా ఆలోచించి నిర్ణ యం తీసుకుంటున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమల తీరులోనూ ఇదే విధానం అవలంభిస్తు న్నారు. ఏ పథకమైనా నిరంతరం కొనసాగా లనే దిశగా ఆలోచన చేస్తున్నారు. స్పౌజ్‌ పిం ఛన్ల పంపిణీది అదే పరిస్థితి. 2023 డిసెంబరు నెల ఒకటో తేదీ తర్వాత భర్త చనిపోతే భార్యకు ఎన్టీఆర్‌ భరోసా పథకం స్పౌజ్‌ పింఛను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 8,541 కొత్త పింఛన్లు మంజూరు చేశారు.ఈ నెల మొదటి వారంలోనే వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీకి కూటమి ప్రభుత్వం అధి కారం చేపట్టి ఏడాది దాటడంతో స్పౌజ్‌ పిం ఛన్లు పంపిణీ చేస్తారని ప్రకటించారు. అయి తే వాయిదా పడింది.ఇప్పటి వరకూ కొత్త పిం ఛన్ల పంపిణీ చేపట్టలేదు.భర్త చనిపోయిన భార్యకు మాత్రమే వితంతు పింఛను ఇవ్వాల ని నిర్ణయించింది.ఎప్పుడిస్తారో ప్రకటించలేదు.

గత ప్రభుత్వంలో ఇలా..

గత ప్రభుత్వంలో పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛన్‌ను భార్యకు మం జూరు చేసేందుకు నెలల సమయం తీసు కు నేది. ఏళ్లు గడుస్తున్నా ఆ కుటుంబంలోని భార్యకు లేదా ఇతర అర్హులైన బంధువులకు పింఛన్‌ మంజూరయ్యేది కాదు.. ఏళ్ల తర బడి ఎదురుచూడాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం లో పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు ఫించన్‌ ఇస్తు న్నారు.2023 డిసెంబర్‌ ఒకటో తేదీ తరువాత నుంచి భర్త చనిపోయినవారికి కూటమి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది.

8,541 మంది ఎంపిక..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 8,541 మందికి కొత్తగా ఈనెల నుంచి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీరికి నెలకు రూ.4 వేల చొప్పున రూ.3 కోట్ల 41 లక్షల 24 వేలు ప్రతినెలా ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది.ఇలా రాష్ట్రవ్యాప్తం గా 89,788 మంది వితంతువులకు ఈ నెల 12న పంపిణీ చేయాల్సిన పింఛన్లు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటిం చింది.ఈ నెలలోనే లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాకినాడ జిల్లాలో 3,118 మందికి కొత్తగా స్పౌజ్‌ పింఛన్లు మంజూరు చేయగా రూ.1కోటి 24 లక్షల 72 వేలు మేర అదనపు భారం పడను ంది.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 2,824 మందికి కొత్తగా స్పౌజ్‌ పిం ఛన్లు మంజూరు కాగా రూ.1 కోటి 12 లక్షల 56 వేలు అదనపు భారం పడనుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2,599 మందికి కొత్తగా స్పౌజ్‌ పింఛన్లు మంజూరు కాగా రూ.1కోటి 3 లక్షల 96 వేలు అదనపు భారం పడనుంది.

Updated Date - Jun 17 , 2025 | 12:37 AM